Share News

చిట్టీల వ్యాపారి పరార్‌..

ABN , Publish Date - Aug 09 , 2026 | 12:33 AM

చిట్టీల పేరుతో డబ్బులు కట్టించు కుని తిరిగి చెల్లించకుండా మోసం చేశాడని ఆరోపిస్తూ ఇరగవరం మం డలం అయినపర్రు గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు పోలీసులను ఆశ్రయించారు.

చిట్టీల వ్యాపారి పరార్‌..

చిట్టీల వ్యాపారి పరార్‌..

న్యాయం చేయాలంటూ ఇరగవరం ఎస్‌ఐ ఎండీ నజీరుల్లాకు బాధితుల మొర

కోట్లలో టోకరా పెట్టినట్టు అనుమానం

ఇరగవరం, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి): చిట్టీల పేరుతో డబ్బులు కట్టించు కుని తిరిగి చెల్లించకుండా మోసం చేశాడని ఆరోపిస్తూ ఇరగవరం మం డలం అయినపర్రు గ్రామానికి చెందిన కొందరు వ్యక్తులు పోలీసులను ఆశ్రయించారు. న్యాయం చేయాలంటూ ఇరగవరం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తణుకు పట్టణానికి చెందని ఫైనాన్స్‌ వ్యాపారి గోలి శ్రీని వాసరావు అయినపర్రుకు చెందిన కొందరి నుంచి చిట్టీల పేరుతో రూ.కోట్ల మేర డబ్బులు కాజేసినట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. తణుకుతో పాటు ఇరగవరం, అత్తిలి, పెనుమంట్ర మండలాల పరిధిలో ఫైనాన్స్‌ వ్యాపారం పేరుతో పలువురి నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. డబ్బులు తిరిగి చెల్లిం చాల్సిన సమయం వచ్చేసరికే పరారీలో ఉండడంతో బాధితులు ఆందో ళన చెందుతున్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ పలువురు అయినపర్రులోని సుమారు 10 మంది బాధితులు ఇరగవరం పోలీస్‌ స్టేషన్‌ను ఆశ్రయించి శనివారం ఫిర్యాదు చేశారు.ఈ వ్యవహారంపై సమ గ్ర దర్యాప్తు జరిపి తమ డబ్బులు తిరిగి ఇప్పించాలని వేడుకుంటున్నారు. బాధితుల ఫిర్యాదుపై విచారణ చేపట్టి,వాస్తవంగా ఎంత మేర డబ్బులు వసూలు చేశారు? ఎంత మంది బాధితులున్నారనే విరాలు సేకరిస్తున్న ట్టు ఇరగవరం ఎస్‌ఐ ఎండీ నజీరుల్లా తెలిపారు. తాను హైదరాబాద్‌లో ఉంటానని రూ.5 లక్షల చిట్టీ వేశానని, రూ.25 వేల చొప్పున 18 నెలలు కట్టినట్టు గోలి శ్రీనివాసరావు తెలిపారు. తాను రెండు చిట్టీలు వేశానని రూ.రెండు లక్షల చిట్టీ పాడినా డబ్బులివ్వకుండా వడ్డీ ఇస్తానంటూ నమ్మ బలికి నోటు రాసి ఇచ్చాడని ఇప్పుడు అడ్రస్‌ లేకుండా పరారయ్యాడం టూ వాపోయారు. న్యాయం చేయాలంటూ బాధితులు వాపోతున్నారు.

Updated Date - Aug 09 , 2026 | 12:33 AM