బాలల సైన్స్ కాంగ్రెస్‌లో రిజిస్ర్టేషన్‌కు గడువు 15
ABN , Publish Date - Aug 05 , 2026 | 12:36 AM
‘పిల్లల కోసం విజ్ఞానం, భవిష్యత్తు అభివృద్ధి కోసం ఆవిష్కరణ’ ప్రధానాంశంగా జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్– 2026 (ఎన్‌సీఎస్‌సీ)లో విద్యార్థులు పాల్గొనేందుకు ఆన్‌లైన్ రిజిస్ర్టేషన్ చేసుకునే గడువు ఈనెల 15వ తేదీతో ముగుస్తుందని డీఈవో వెంకటలక్ష్మమ్మ, ఎన్‌సీఎస్‌సీ జిల్లా కో–ఆర్డినేటర్ ఎస్.వెంకటేశ్వరరావు తెలిపారు.
ఏలూరు అర్బన్, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి) :‘పిల్లల కోసం విజ్ఞానం, భవిష్యత్తు అభివృద్ధి కోసం ఆవిష్కరణ’ ప్రధానాంశంగా జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్– 2026 (ఎన్‌సీఎస్‌సీ)లో విద్యార్థులు పాల్గొనేందుకు ఆన్‌లైన్ రిజిస్ర్టేషన్ చేసుకునే గడువు ఈనెల 15వ తేదీతో ముగుస్తుందని డీఈవో వెంకటలక్ష్మమ్మ, ఎన్‌సీఎస్‌సీ జిల్లా కో–ఆర్డినేటర్ ఎస్.వెంకటేశ్వరరావు తెలిపారు. మంగళవారం జిల్లా విద్యాశాఖ ముద్రించిన సంబంధిత పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సంద ర్భంగా డీఈవో మాట్లాడుతూ ‘తగ్గించు, తిరిగి వాడకం, పునర్వినియోగంలోకి తీసుకురావడం’ ఒక అంశంగాను, ‘అన్వేషణ, ప్రయోగం, సామర్థ్యపెంపు, అభివృద్ధి’ ఒక అంశంగాను, ‘సేకరణ, సంరక్షణ, పునర్వినియోగం, సంరక్షణ’ ఒక అంశంగాను, ‘ఆహారం, వ్యవసాయం, ఆరోగ్యం’ ఒక అంశంగాను, ‘భారతీయ సంప్రదాయ జ్ఞాన వ్యవస్థలు’ ఒక అంశంగాను సైన్స్ ప్రాజెక్టులను నిర్ణీత గడువు తేదీలోగా ఎన్‌సీఎస్‌సీ పోర్టల్‌లో నమోదుచేసుకోవాలని కోరారు. ఐదో తరగతి నుంచి ఇంటర్మీడియట్/డిగ్రీ వరకు చదువుతున్న విద్యార్థులు పాల్గొన వచ్చన్నారు. జిల్లాస్థాయి ఎంపికల తర్వాత రాష్ట్రస్థాయి పోటీకి అర్హత సాధిస్తా రని వివరించారు. ప్రతి పాఠశాలనుంచి కనీసం ఒక ప్రాజెక్టు తప్పనిసరిగా నమోదుచేయాలని, ఈ విషయంలో ఏ పాఠశాలకు కూడా మినహాయింపులేదని స్పష్టం చేశారు. స్థానిక సమస్యలకు పరిష్కారాలు సూచించే వినూత్న ప్రాజె క్టులను ఎంపికచేయాలన్నారు. సైన్స్ టీచర్లు, హెచ్‌ఎంలు చొరవతీసు కోవాలన్నారు. వివరాలకు 81420 35942, 98499 09105 నంబర్లలో సంప్రదిం చాలని కోరారు. డీసీఈబీ కార్యదర్శి పి.సురేష్, జిల్లా సైన్స్ ఆఫీసర్ సోమయా జులు, తదితరులు పాల్గొన్నారు.