డీఎస్పీ నంటూ పరిచయం
ABN , Publish Date - Oct 11 , 2026 | 12:09 AM
తాను ఒక పోలీస్‌శాఖలో డీఎస్పీనని తనకు గోల్డ్‌వర్క్ బిజినెస్ ఉందంటూ యువతులకు, మహిళలకు వల... ఆపై ఉద్యోగాలు ఇప్పిస్తాన ంటూ నమ్మబలికి పుణ్యక్షేత్రాలకు రోజుల తరబడి తిప్పిస్తూ వారి నుంచి దశల వారీగా డబ్బులను గుంజుకుంటున్న వ్యక్తిపై ఏలూరు టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ
నిరుద్యోగులకు వల
నకిలీ అపాయింట్‌మెంట్ ఆర్డర్లు
లబోదిబో మంటూ పోలీసులకు
ఫిర్యాదు చేసిన బాధితులు
ఏలూరు క్రైం, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి) : తాను ఒక పోలీస్‌శాఖలో డీఎస్పీనని తనకు గోల్డ్‌వర్క్ బిజినెస్ ఉందంటూ యువతులకు, మహిళలకు వల... ఆపై ఉద్యోగాలు ఇప్పిస్తాన ంటూ నమ్మబలికి పుణ్యక్షేత్రాలకు రోజుల తరబడి తిప్పిస్తూ వారి నుంచి దశల వారీగా డబ్బులను గుంజుకుంటున్న వ్యక్తిపై ఏలూరు టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఏలూరు చోడిదిబ్బ పెద్ద రామాలయం ప్రాం తానికి చెందిన పాలికరంగ వీరబాబు ఇంటర్మీ డియట్ వరకూ చదివాడు. ఏలూరులోని బ్రాందీషాపులో మూడు నెలల క్రితం వరకు పనిచేశాడు. అదే ప్రాంతానికి చెందిన దేవి అనే యువతి వీరబాబు ఇంటికి వచ్చి అతని భార్యతో తనకు విజయవాడలోని ఒక గోల్డ్‌వ ర్క్‌లో జాబు వచ్చిందని చెప్పడంతో ఆమెకు జతగా తనకు జాబు ఇప్పించమంటూ వెళ్లిం ది. విజయవాడలోని ఒక వ్యక్తి గుంటూరు డీఎస్పీ అని తన పేరు బత్తుల శ్రీనివాస్ అంటూ యూనిఫామ్‌లో కనిపించి ఐడి కార్డు కూడా చూపించాడు. తాను ఉద్యోగాలు ఇప్పి స్తానని నమ్మబలకడంతో వెంటనే వీరబాబు భార్య వీరబాబుకు ఫోన్ చేసి చెప్పడంతో సర్టిఫికెట్లు జిరాక్స్‌లు తీసుకుని తరువాత రావాలని సూచించడంతో గత జూలై 20వ తేదీన గుంటూరు కలెక్టర్ ఆఫీస్ వద్దకు వెళ్ళా రు. బత్తుల శ్రీనివాస్ పోలీస్ యూనిఫాంలో ఉండి జిరాక్స్ కాపీలు, రెండు లక్షల రూపా యలు తీసుకున్నాడు. దశలవారీగా శ్రీశైలం, యాదగిరిగుట్ట, బాపట్ల, భద్రాచలం వంటి పుణ్యక్షేత్రాలకు తీసుకువెళ్ళి మొత్తం మీద 18 లక్షల రూపాయలు తీసుకున్నారు. అంతేకా కుండా వెళ్ళిన ప్రతి ప్రాంతంలో వారం పది రోజుల పాటు లాడ్జి రూముల్లో ఉండడం ఆ ఖర్చులన్నీ వీరిపైనే వేసేవాడు. వీరబాబు స్నేహితుడైన గణేష్‌కు ఎస్‌ఐ ఉద్యోగం ఇప్పి స్తానని రెండు లక్షల రూపాయలు తీసుకు న్నాడు. అంతేకాకుండా వీరబాబు మేనకోడలు, అతని భార్య బంధువులు, చుట్టుపక్కల వారికి కూడా ఉద్యోగాలు ఇప్పిస్తానని లక్షలాది రూపాయలు తీసుకున్నాడు. వీరబాబుకి గణేష్‌కు ఎస్‌ఐ ఉద్యోగాలు వచ్చాయంటూ నమ్మబలికి యూనిఫామ్‌ను కూడా వారికి అందజేసి ధరించిన తరువాత ఫొటోలు తీసు కున్నాడు. ఆర్డర్లు ఇవ్వడంతో అవి తీసుకుని ఏలూరు వచ్చారు. వీరబాబుకు పోలీస్ కార్యా లయంలో పనిచేసే శివ ప్రసాద్ అనే బంధు వుకు ఆర్డర్ కాపీ చూపించడంతో అది నకిలీ దని చెప్పారు. దీంతో తాను మోసపోయానని గమనించి ఏలూరు టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏలూరు టూటౌన్ సీఐ కె అశోక్‌కుమార్ కేసు నమోదు చేయగా ఏలూ రు డీఎస్పీ డి.శ్రావణ్‌కుమార్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేపట్టారు. బత్తుల శ్రీనివాస్‌ను అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.