వివాహేతర సంబంధాల చిచ్చు
ABN , Publish Date - Oct 07 , 2026 | 12:13 AM
ఒకప్పుడు ప్రశాంతంగా ఉండే ఏలూరు జిల్లాలోని ఏజెన్సీ, మెట్ట ప్రాంతాల్లో నేరాలు తొంగిచూస్తున్నాయి. ఈ కారణంగా ప్ర శాంత వాతావరణం కనుమరుగవుతోంది.
వివాహేతర సంబంధాల చిచ్చు
ఒకే నెలలో రెండు దారుణ హత్యలు..
నెత్తురోడుతున్న పచ్చని కాపురాలు
దర్భగూడెం, కన్నాపురంలో వెలుగుచూసిన దారుణాలు
కౌన్సెలింగ్ ద్వారా సమస్యల పరిష్కారానికి పోలీసుల కృషి
జంగారెడ్డిగూడెం క్రైం/జీలుగుమిల్లి, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): ఒకప్పుడు ప్రశాంతంగా ఉండే ఏలూరు జిల్లాలోని ఏజెన్సీ, మెట్ట ప్రాంతాల్లో నేరాలు తొంగిచూస్తున్నాయి. ఈ కారణంగా ప్ర శాంత వాతావరణం కనుమరుగవుతోంది. ఒక ప్పుడు చిన్నపాటి గొడవలను పెద్దల సమక్షంలో పరిష్కరించుకునే గ్రామాలు, ఇప్పుడు దారుణ హత్యలకు వేదికగా మారుతున్నాయి. ముఖ్యంగా వివాహేతర సంబంధాల కారణంగా నెల రోజుల వ్యవధిలోనే ఈ ప్రాంతంలో రెండు హత్యలు జరగడం స్థానికులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. పచ్చని కాపురాల్లో అనుమానాలు చిచ్చుపెడుతూ ప్రాణాల మీదకు తెస్తున్నాయి.
వరుస హత్యలు..
జీలుగుమిల్లి మండలం దర్భగూడేనికి చెం దిన పల్లెం వెంకయ్య సెప్టెంబరు 29వ తేదీ వేకువ జామున దారుణహత్యకు గురయ్యాడు. స్థానిక కుంతీదేవి ఆలయం అరుగుపై నిద్రి స్తున్న అతడి తలపై దుండగులు కర్రతో దాడి చేసి హతమార్చారు. పోలీసుల దర్యాప్తులో అసలు వాస్తవాలు వెలుగుచూశాయి. గ్రామానికి చెం దిన ఒక మహిళతో వెంకయ్యకు గతంలో వి వాహేతర సంబంధం ఉండేది. ఈ నేపథ్యంలో ఆమె ఇంటికి వెళ్లి అతను తరచూ గొడవ పడు తుండేవాడు. దీంతో ఆగ్రహించిన ఆ మహిళ కుమారుడు అజయ్ కుమార్, వెంకయ్యను కర్రతో కొట్టి చంపినట్టు పోలీసులు దర్యాప్తులో తేలింది.
కొయ్యలగూడెం మండలం కన్నపురం గ్రా మానికి చెందిన పల్లికొండ ముఖేంద్రబాబు(35) హత్య కేసును కూడా పోలీసులు ఛేదించారు. గత సెప్టెంబరు 27న దేవరపల్లి శివారులోని పోలవరం కాలువలో అతని మృతదేహాన్ని గు ర్తించారు. ముఖేంద్రబాబు భార్య చందు అక్ర మ సంబంధమే ఈ హత్యకు దారితీసినట్లు విచారణలో తేలింది. పథకం ప్రకారం ముఖేం ద్రబాబుకు మద్యం తాగించి, సుత్తితో మోది దారుణంగా హతమార్చినట్లు పోలీసులు వెల్ల డించారు. ఈ కేసుకు సంబంధించి ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు.
సామాజిక పరిస్థితులే కారణమా?
గతంతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో సా మాజిక సంబంధాల్లో మార్పులు వస్తున్నాయి. కుటుంబ, ఆస్తి, ఆర్థిక, వ్యక్తిగత వివాదాలు తీవ్రరూపం దాల్చడం, మద్యం వంటి అంశాలు ఘర్షణలకు దారితీయడం, చిన్నపాటి గొడవలు పెద్దవిగా మారడం వంటివి చోటు చేసుకుంటు న్నాయి.ప్రధానంగా మద్యం సేవించడం, ఆర్థిక అవసరాలు, అప్పులు, కట్నం తదితర కారణాల వలన భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతు న్నాయి. ప్రస్తుతం వివాహేతర సంబంధాలు కూడా కుటుంబాల మధ్య అధికంగా చిచ్చు పెడుతున్నాయి. అనుమానాలు, ఆరోపణలు, నిర్ధా రణ చేసుకున్న సందర్భాల్లో ఎన్నో కుటుం బాలు విడివిడిగా రోడ్డున పడుతున్నాయి. భార్యా భర్తల మధ్య తలెత్తుతున్న అనుమానాలు హత్యలు, విడాకులకు దారితీస్తుండటంతో పసి పిల్లల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతోంది. ఈ పరిణామాలను గమనించిన పోలీసులు.. కుటుంబ కలహాలపై కేసులు నమోదు చేయ కుండా, గ్రామ పెద్దల సమక్షంలో ఇరువర్గాలకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు.వివాదాలను సామ రస్యంగా పరిష్కరించి కుటుంబాలను నిలబెట్టేం దుకు ప్రత్యేక చొరవ చూపుతున్నారు.