Share News

రెవెన్యూలో అధికార విభజన

ABN , Publish Date - Jan 05 , 2026 | 12:46 AM

రెవెన్యూ కీలకమైన దరఖాస్తులు, సమస్యలు పర్యవేక్షణ, పరిష్కార మార్గాల కోసం ప్రభుత్వం అధికారాల విభజనకు శ్రీకారం చుట్టింది.

రెవెన్యూలో అధికార విభజన

జాయింట్‌ కలెక్టర్ల నుంచి ఆర్డీవో, తహసీల్దార్లకు బాధ్యతలు

త్వరలో కలెక్టర్‌ ప్రొసీడింగ్స్‌

(ఏలూరు–ఆంధ్రజ్యోతి)

రెవెన్యూ కీలకమైన దరఖాస్తులు, సమస్యలు పర్యవేక్షణ, పరిష్కార మార్గాల కోసం ప్రభుత్వం అధికారాల విభజనకు శ్రీకారం చుట్టింది. భూసేకరణ, మ్యుటేషన్లు, ఇతర సమస్యలను వేగవంతంగా పరిష్కరించే దిశగా సంస్కరణలు మార్పులకు తెర తీసింది. 22ఏ నిషేధిత భూముల పరిష్కారాలను రాబోయే మూడు నెలల్లో చేపట్టాలని కూడా దిశా నిర్దేశం చేసింది. త్వరలో కలెక్టర్‌ వెట్రిసెల్వి దీనిపై అధికారులు, కింద స్థాయి ఉద్యోగులు ఒక సమావేశం నిర్వహించి మార్గనిర్దేశకత్వం చేయనున్నారు. కొత్త సంవత్సరంలో రెవెన్యూ సమస్యల పరిష్కారానికి అధికారాల విభజనతో ప్రభుత్వం ముందడుగు వేసింది. పలు అంశాల పర్యవేక్షణ బాధ్యతలను జాయింట్‌ కలెక్టర్‌ నుంచి ఆర్డీవోలకు, తహసీల్దార్లకు శుక్రవారం బదలాయింపు చేసేలా పలు మార్పులకు శ్రీకారం చుట్టింది. రెవెన్యూలో ప్రజల సంతృప్త స్థాయిని పెంచడానికి ఈ సంస్కరణలు, మార్పులు, చేర్పులు ఉపకరించ నున్నాయి. ఇక రెవెన్యూ సమస్యలు సులభంగా పరిష్కారం వంతం అవుతాయని భావిస్తున్నారు. ఇక పీజీఆర్‌ఎస్‌కు అనుసంఽధానంగా రెవెన్యూ క్లినిక్‌లను ప్రతీ సోమవారం నిర్వహించాల్సి ఉంటుంది. దీంతో అధికారులు వేగంగా దరఖాస్తులను పరిష్కరించడంపై దృష్టి సారించే వీలుంది. తాజాగా 22ఏ జాబితాల నుంచి ప్రైవేట్‌ భూముల తొలగింపుతో సహా మ్యుటేషన్‌ సేవలు, సర్వే నంబర్ల డూప్లికేషన్‌, నోషనల్‌ ఖాతాలను శాశ్వత ఖాతాలుగా మార్చడం, ఆధార్‌ నంబర్ల సవరణ వరకు దీర్ఘకాలిక సమస్యల పరిష్కారమే లక్ష్యంగా స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. దరఖాస్తుల పరిష్కారంలో జాప్యాన్ని తగ్గించే క్రమంలో ఇప్పటి వరకు జేసీ వద్ద ఉన్న అధికారాల్ని తహసీల్దార్లకు, ఆర్డీవోలకు బదలాయింపు చేశారు. రెవెన్యూ సమస్యల పరిష్కారంలో ఉద్దేశపూర్వక జాప్యం చేసినా, రెవెన్యూ రిజిస్ర్టేషన్‌ దరఖాస్తులను అప్‌డేట్‌ చేయకపోయినా విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా భావించి వివరణ కోరతారు. మరోవైపు ఇందులో తప్పులు చేస్తే వారిపై చర్యలను కలెక్టర్‌ తీసుకోవచ్చు.

Updated Date - Jan 05 , 2026 | 12:46 AM