Share News

మున్సిపాలిటీలకు.. ఛాలెంజ్‌!

ABN , Publish Date - Jun 14 , 2026 | 01:18 AM

పట్టణాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అర్బన్‌ చాలెంజ్‌ ఫండ్‌(యూసీఎఫ్‌)ను కొత్తగా ప్రవేశపెట్టింది. ఇందుకోసం లక్ష కోట్ల రూపాయలను సిద్ధం చేసింది. నిధులు కేటాయింపునకు జిల్లాలోని అర్హత వున్న మున్సిపాలిటీలు భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకులను ఎంపిక చేసింది.

మున్సిపాలిటీలకు.. ఛాలెంజ్‌!

అర్బన్‌ ఛాలెంజ్‌ ఫండ్‌కు భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం ఎంపిక

కేంద్రం నుంచి 25 శాతం రాయితీ.. మిగిలిన 75 శాతం హడ్కో రుణం

తక్కువ వడ్డీతో తీర్చుకునే వెసులుబాటు

అధికారుల పెదవి విరుపు.. భారమవుతుందని భావన

పీపీపీ మోడ్‌లో మార్కెట్‌, షాపింగ్‌ కాంప్లెక్స్‌ల నిర్మాణానికి సన్నద్ధం

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

పట్టణాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరిచే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అర్బన్‌ చాలెంజ్‌ ఫండ్‌(యూసీఎఫ్‌)ను కొత్తగా ప్రవేశపెట్టింది. ఇందుకోసం లక్ష కోట్ల రూపాయలను సిద్ధం చేసింది. నిధులు కేటాయింపునకు జిల్లాలోని అర్హత వున్న మున్సిపాలిటీలు భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకులను ఎంపిక చేసింది. ఈ మూడు మున్సిపాలిటీల అధికారులకు ఇటీవల రెండు రోజులపాటు వర్క్‌ షాప్‌ నిర్వహించారు. నిధులు, విధి విధానాలను వివరించారు. ఒక్కో ప్రాజెక్ట్‌కు రూ.100 కోట్లు ఉండేలా ప్రణాళిక చేయాలి. ముఖ్యంగా తాగు నీరు, వర్షపు నీటి డ్రెయిన్‌ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలి. దీనివల్ల పట్టణాల్లో ముంపు ఉండదు. దోమల బెడద తగ్గుతుంది. మంచినీరు పుష్కలంగా పంపిణీ చేసే అవకాశాలు పెరుగుతాయి. ప్రాజెక్ట్‌ వ్యయంలో 25 శాతం కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తుంది. మిగిలిన 75 శాతం నిధులను హడ్కో ద్వారా రుణం తీసుకోవడానికి వెసులుబాటు కల్పించారు. మున్సిపాలిటీల్లో తాకట్టు పెట్టేందుకు అర్హత వున్న ఆస్తులను హడ్కోకు భరోసాగా సమర్పించాలి. నిధులకు ఇబ్బంది లేదు. ప్రాజెక్ట్‌ డీపీఆర్‌ పంపిన వెంటనే మంజూరుచేస్తారు. కానీ తిరిగి చెల్లింపులపైనే ఇప్పుడు మున్సిపాలిటీలు ఆలోచిస్తున్నాయి.

తాడేపల్లిగూడెంలో మల్లగుల్లాలు

పట్టణాల్లో మంచినీటి కోసం అమృత్‌ పథ కంలో నిధులు మంజూరయ్యాయి. తాడేపల్లిగూ డెంలో రెండో సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంక్‌ నిర్మిస్తు న్నారు. మరో 1.10 కోట్ల లీటర్ల సామర్ధ్యం వున్న ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలోని మిగిలిన మున్సిపాలిటీలకు గోదావరి నుంచి నేరుగా పైప్‌లైన్లు వేసి పంపుల చెరువు లకు నీటిని మళ్లించనున్నారు. దీనికోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమృత్‌ ప్రాజెక్ట్‌లో నిధులు మంజూరు చేశాయి. జిల్లాలో పైప్‌లైన్‌ ప్రాజెక్ట్‌ కు రూ.627 కోట్లు కేటాయించారు. తాడేపల్లిగూ డెం పంపుల చెరువుకు రూ.73 కోట్లు వెచ్చిస్తు న్నారు. మరో రూ.88 కోట్లతో భూగర్భ డ్రైనేజీని పూర్తి చేయనున్నారు. అమృత్‌ నిధుల్లో మున్సి పాలిటీలు తమ వంతుగా 30 శాతం చెల్లించాలి. ఇదే పెద్ద భారమవుతుందని మున్సిపాలిటీలు భావిస్తున్నాయి. దీంతో అర్బన్‌ ఛాలెంజ్‌ ఫండ్‌పై పెదవి విరిస్తున్నారు. హడ్కో రుణాన్ని తిరిగి చెల్లించే స్తోమత మున్సిపాలిటీలకు ఉండదని భావిస్తున్నారు. ఫలితంగా ప్రాజెక్ట్‌ల రూపకల్పన ప్రతిపాదనను విరమించుకుంటున్నారు. తాడేప ల్లిగూడెంలో మున్సిపల్‌ ఇంజనీరింగ్‌ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. పట్టణాల్లో ప్రధాన డ్రెయిన్ల పూర్తికి ఇప్పటికే రూ.43 కోట్లతో సమగ్ర ప్రాజెక్ట్‌ నివేదికను సిద్ధం చేశారు. పట్టణాల్లో వంద శాతం డ్రెయిన్లు పూర్తి చేయాలంటే రూ.80 కోట్లు అవుతుందని అంచనా. ప్రజల నుంచి తిరిగి సొమ్ములు వచ్చే ప్రాజెక్ట్‌లకే నిధులు వెచ్చించాలని కేంద్ర బృందం సూచి స్తోంది. అప్పుడే రుణాలు చెల్లించే ఆర్థిక పరి పుష్టి ఉంటుందని కేంద్రం విశ్వసిస్తోంది. వర్షపు నీటి డ్రెయిన్‌ల విషయంలో ప్రజల నుంచి ఎటువంటి ఆదాయం రాదు. దీనిపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు.

మంచినీటికి అవసరం లేదా

అర్బన్‌ ఛాలెంజ్‌ ఫండ్స్‌తో మంచినీటికి అద నంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదని భావిస్తున్నాయి. నీటి శుద్ధి సామర్థ్యాన్ని పెంచు కోవాలి. ఓవర్‌ హెడ్‌ ట్యాంక్‌లు నిర్మించాలి. అవసరమైనచోట కొత్త పైప్‌లైన్లు వేయాలి. అవే మీ లేకపోవడంతో పట్టణాల్లో మంచినీటి సమ స్య ఉంది. ప్రతిరోజు విద్యుత్‌ కోతలు అమలు చేస్తున్నారు. ప్రజల సంతృప్తి స్థాయిలో ప్రభు త్వం సేకరించిన సర్వేలోనూ జిల్లాలోని పట్టణా ల్లోని చివరి స్థానంలో ఉన్నాయి. జిల్లా అట్టడు గున ఉందంటూ సిద్ధాంతం సభలో సీఎం చంద్రబాబు మున్సిపల్‌ అధికారులపై మొట్టి కాయలు వేశారు. ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లు, పైప్‌ లైన్లు, ఓవర్‌ హెడ్‌ ట్యాంకుల నిర్మాణానికి నిధు లు వెచ్చించాలి. అప్పుడే పట్టణ ప్రజలకు సమృ ద్ధిగా మంచి నీరందించే అవకాశం ఉంటుంది. నివాసాలు, వాణిజ్య సముదాయాల నుంచి నీటి పన్ను పెంచి వసూలు చేయాలి. దీనివల్ల మం చి నీటికి ఇబ్బంది ఉండదు. ప్రజలకు సమృద్ధిగా మంచినీరు లభిస్తుంది. ఆ దిశగా మున్సిపాలి టీలు ఆలోచించలేకపోతున్నాయి. ప్రతీ ఇంటికి వాటర్‌ మీటర్లు పెట్టాలన్న ప్రతిపాదన ఉంది. ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందన్న ఉద్దేశంతో వెనుకంజ వేస్తున్నాయి. విద్యుత్‌ కోతల వల్ల ఇప్పుడు మంచినీటి కొరత ఏర్పడుతోంది. పట్టణ ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఫండ్‌పై కేంద్ర రాయితీ 25 శాతమే ప్రకటించడంతో వెనకడుగు వేసే పరిస్థితి కనిపిస్తోంది.

Updated Date - Jun 14 , 2026 | 01:18 AM