Share News

కుర్చీలు ఖాళీ

ABN , Publish Date - Apr 02 , 2026 | 12:30 AM

పంచాయతీ పాలకవర్గాల ఐదేళ్ల పదవీ కాలం నేటితో ముగియ నుంది. సర్పంచ్‌లు ఇకపై మాజీలు కానున్నారు. రేపటి నుంచి ప్రత్యేక అధికా రుల పాలన రానుంది.

కుర్చీలు ఖాళీ

రేపటి నుంచి ప్రత్యేకాధికారుల పాలన

546 పంచాయతీలకు నియామకం పూర్తి.. రేపు బాధ్యతలు స్వీకరణ

ఒక్కొక్క అధికారికి రెండు

నుంచి మూడు పంచాయతీలు

పంచాయతీ పాలకవర్గాల ఐదేళ్ల పదవీ కాలం నేటితో ముగియ నుంది. సర్పంచ్‌లు ఇకపై మాజీలు కానున్నారు. రేపటి నుంచి ప్రత్యేక అధికా రుల పాలన రానుంది. ప్రతి పంచాయతీకి ప్రత్యేక అధికారిని నియ మించేలా జిల్లా కలెక్టర్‌ చర్యలు తీసుకున్నారు. ఎన్నికలు జరిగి కొత్త పాలకవర్గాలు పగ్గాలు చేపట్టే వరకు ప్రత్యేక పాలనే కొనసాగుతుంది.

ఏలూరుసిటీ, ఏప్రిల్‌ 1(ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీల్లో పాలకవర్గాల పాలన గడువు నేటితో ముగుస్తోంది. రేపటి నుంచి గ్రామ పంచాయతీల పాలన ప్రత్యేకాధికారుల చేతుల్లోకి వెళ్లనుంది. పంచా యతీల్లో ఎన్నికలు నిర్వహించి పాలకవర్గాలు ఏర్పాట య్యే వరకు ప్రత్యేకాధికారుల పాలనే జరుగు తుంది. జిల్లాలో 546 పంచాయతీలు ఉండగా ఎంపీ డీవో, తహసీల్దార్‌, డిప్యూటీ తహసీల్దార్‌, సివి ల్‌సప్లయీస్‌ డీటీ, డిప్యూటీ ఎంపీడీవో, ఈవోఆర్డీ, ఎంఈవో, వ్యవ సాయ, ఉద్యాన, మత్స్యశాఖ, పశు సంవర్ధక శాఖాధి కారులను, ఇంజనీరింగ్‌ శాఖాధికారులను ప్రత్యేకాధి కారులు/ పర్సన్‌ ఇన్‌చార్జిలుగా నియ మిస్తూ కలెక్టర్‌ వెట్రిసెల్వి ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలోని రెండు నుంచి మూడు పంచాయతీలకు ఒక ప్రత్యేకాధికారిని నియమించారు. మండలం ప్రాతిపదికగా వీరిని నియమించారు. వీరంతా రేపు అయా పంచాయతీ ల్లో బాధ్యతలు చేపడతారు. గ్రామాల్లో నిర్వహించే అభివృద్ధి కార్యక్రమాలు, 15వ ఆర్థిక సంఘ నిధుల నిర్వహణ, సాధారణ పాలనా నిర్వహణ, పంచా యతీలకు సంబంధించి సాధారణ పనుల నిర్వహణ, ప్రభుత్వ పథకాల అమలు వీరి ఆధ్వర్యంలోనే జరుగుతాయి. ప్రత్యేకాధికారుల పాలనలో అత్యవసర పనులకే ప్రాధాన్యం ఇస్తారు. ఎటువంటి రాజకీయా లకు తావు ఇవ్వకుండా పాలన నిర్వహించాల్సి ఉంటుంది.

బిల్లుల కోసం కార్యదర్శులపై ఒత్తిడి

మండవల్లి, ఏప్రిల్‌ 1(ఆంధ్రజ్యోతి): పంచాయతీ పాలకవర్గాల పదవీ కాలం ముగియడానికి సమయం దగ్గరపడుతున్న వేళ గ్రామ పాలనలో ఆందోళనకర పరిస్థితులు నెలకొంటున్నాయి. గడువు ముగిసేలోపు ఏదోలా బిల్లులు క్లియర్‌ చేసి నిధులు డ్రా చేసుకోవాలనే తలంపుతో కొందరు సర్పంచ్‌లు పంచాయతీ కార్య దర్శు లపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్టు తెలు స్తోంది. ఈ ఒత్తిడికి తాళలేక కొంతమంది కార్యదర్శులు సెలవుల పేరుతో విధులకు దూరంగా ఉన్నట్టు సమాచారం. మండలంలోని ఓ గ్రామ పంచాయతీలో ఒక కరెంటు స్తంభం కోసం విజ్ఞప్తి చేయగా అదే ప్రాంతంలో ఐదు స్తంభాలు వేర్వేరు పేర్లతో చూపాలని కార్యదర్శిపై ఒత్తిడి తెచ్చినట్టు తెలిసింది. ఈ వ్యవహారంతో విసిగిపోయిన కార్యదర్శి చేతులెత్తేసినట్లు సమాచారం.

Updated Date - Apr 02 , 2026 | 12:30 AM