ఎంతిస్తారో?
ABN , Publish Date - Nov 13 , 2026 | 12:11 AM
అర్నబ్, మురసు తుఫాన్‌ల ఽధాటికి ఏలూరు జిల్లా అతలాకుతలం అయ్యింది. జిల్లాలో వివిధ పంటలతో పాటు, రోడ్లు, భవనాలశాఖ, పంచా యతీరాజ్ శాఖరోడ్లకు తీరని నష్టం వాటిల్లింది.
నేడు తుఫాన్ నష్టాల అంచనాలకు కేంద్ర బృందం రాక
ఉంగుటూరులోనే పర్యటన
వివిధ శాఖల నష్టం రూ.500 కోట్ల పైమాటే
వ్యవసాయ,ఉద్యాన వనాలకు రూ.130 కోట్లు ..
ఏర్పాట్లు చేసిన జిల్లా యంత్రాంగం
(ఏలూరు–ఆంధ్రజ్యోతి)
అర్నబ్, మురసు తుఫాన్‌ల ఽధాటికి ఏలూరు జిల్లా అతలాకుతలం అయ్యింది. జిల్లాలో వివిధ పంటలతో పాటు, రోడ్లు, భవనాలశాఖ, పంచా యతీరాజ్ శాఖరోడ్లకు తీరని నష్టం వాటిల్లింది. గృహ నిర్మాణశాఖ పరిధిలో ఇళ్లు, జలవనరుల శాఖకు చెందిన వివిధ జలాశయాల వద్ద ఆన కట్టలు, స్లూయజ్‌లు, చెక్‌డ్యామ్‌లు కొట్టుకు పోయాయి. ఓవరాల్‌గా రూ.500 కోట్ల పైబడి నష్టం వాటిల్లినట్లు ప్రాథమిక అంచనాలు రూ పొందించారు. ఈ నష్టంపై పరిశీలనకు కేంద్రం బృందం నేడు జిల్లాకు రానుంది. నలుగురితో కూడిన టీమ్‌కు కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖలో డిప్యూటీ సెక్రటరీ అలోక్ జవహర్ నాయకత్వం వహించనున్నారు. బృందం ఉంగుటూరు నియో జకవర్గంలోనే అన్ని నష్టాలను శుక్రవారం దాదా పుగా నాలుగు గంటల పాటు పరిశీలించి, అనంతరం రాజమహేంద్రవరం వెళ్లనుంది. అయితే కేంద్రబృందం ఎంతమేర నష్ట పరిహా రం మంజూరుకు గ్రీన్‌సిగ్నల్ ఇస్తుందన్నది వేచిచూడాలి.
వ్యవసాయానికి తీరని నష్టం
వ్యవసాయ, ఉద్యానపంటలకు దాదాపుగా రూ.130 కోట్ల పైబడి నష్టం వాటిల్లినట్టు అంచ నా. ఈ ఏడాది ఎల్‌నినో కారణంగా సార్వా సాగులో జూన్ నుంచి సెప్టెంబరు వరకు వర్షా భావ పరిస్థితులు ఏర్పడ టంతో లోటు వర్ష పాతం నమోదైంది. అతి భారీ వర్షాలు కారణంగా జిల్లాలో 39,763 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. వరితో పాటు మొక్కజొన్న, అపరాలు, పత్తి, పొగాకు, వేరుశెనగ పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వరి 29,524 ఎకరాల్లో, మొక్క జొన్న 1,675, కందుల పంటలు కలిపి నష్టం రూ.120 కోట్లు పైబడి ఉంటుందని వ్యవసాయ శాఖ చెబుతోంది. ఉద్యాన పంటలకు దాదాపుగా రూ.ఏడు కోట్ల పైబడి ప్రాథమిక నష్టం వాటి ల్లింది. అరటి 300 హెక్టార్లలో, కూరగాయాల పంటలు 100 హెక్టార్లల్లో, పామాయిల్ తోటల్లో దాదాపుగా 200 మొక్కలు నేలకూలాయి. అర్నబ్ తుఫాన్‌లో ఉద్యానపంటలకు రూ.కోటి నష్టం వాటిల్లింది. ఇక రోడ్ల పరంగా రోడ్లు భవనాలశాఖకు 334 కిలోమీట్ల రహదారులు దెబ్బతినడం వల్ల రూ.231 కోట్ల మేర నష్టం వాటిల్లింది. పంచాయతీరాజ్ శాఖకు రూ.50కోట్ల పైబడి నష్టం వాటిల్లింది.
జలవనరులశాఖకు అపార నష్టమే
జిల్లాలో ఈసారి వర్షాలకు ఏజెన్సీల్లోని వాగులు, వంకలు విపరీతంగా పొంగి పొర్లడం వల్ల ఎర్రకాల్వ, కొవ్వాడ కాల్వ పరిసరాల్లో కట్టడాలు తీవ్ర దెబ్బ తిన్నాయి. దాదాపుగా 50 మైనర్ ఇరిగేషన్ చెరువుల కట్టలు తెగిపోయాయి. సర్‌ప్లస్ ఛానల్స్ తెగిపోయాయి. ఈ శాఖపరంగా రూ.64 కోట్ల పైబడి ప్రాఽథమిక నష్టం జరిగినట్లు అంచనాలు రూపొందించారు.
గృహనిర్మాణశాఖకు రూ.24.40 లక్షలు
తుఫాన్ ధాటికి పలు మండలాల్లో 26 పక్కా ఇళ్లు పాక్షికంగా 45 ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. వీటికి మొత్తం రూ.24.40 లక్షలు అవసరమని ఆ శాఖ అధికారులు అంచనాలు రూపొందించారు.
బృందం పర్యటన ఇలా..
జిల్లాలో మురసు తుఫాన్ కారణంగా జరిగిన నష్టాలను పరిశీలించేందుకు అంతర్ మంత్రిత్వ శాఖల కేంద్రబృందం ఈ నెల 13న జిల్లాకు రానుందని కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖలో డిప్యూటీ సెక్రటరీ అలోక్ జవహర్ ఆధ్వర్యంలో బృందసభ్యులు జిల్లాలో పర్యటిస్తారు. ఇస్రో నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ సైంటిస్టు డాక్టర్ ఎస్‌వీఎస్‌పీ శర్మ, హైదరాబాద్‌లోని సెంట్రల్ వాటర్ కమిషన్ ఎస్‌ఈ రేఖారాణి కొల్లు, విజయవాడలోని జాతీ య రహదారుల శాఖ ప్రాంతీయ కార్యాలయ ఈఈ శశాంక్ శేఖర్‌రాజ్ లు సభ్యులుగా ఉన్నారు. ఉదయం 10.30 గంటలకు విజయవాడ నుంచి కారులో బయల్దేరి మధ్యాహ్నం ఒంటిగంటకు నిడమర్రు మండలం అడవికొలను చేరుకుని దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలిస్తారు. అనంతరం రైతులను కలిసి మాట్లాడతారు. మధ్యాహ్నం 2 గంటలకు అడవికొలను నుంచి బయల్దేరి 2.30 గంటలకు ఉంగుటూరుకు చేరుకుని, భోజనానం తరం అక్కడే తుఫాన్ నష్టాలపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను రావులపర్రులో పరిశీలిస్తారు. దెబ్బతిన్న పంట పొలాలను, డ్రెయిన్లను పరిశీలించి రైతులతో మాట్లాడతారు. సాయంత్రం 4.30 గంటలకు రావులపర్రు నుంచి బయల్దేరి 5 గంటలకు భీమడోలుకు చేరు కుంటారు. సూరప్ప గూడెంలో పంటల పొలాలను పరిశీలించి రాజమహేంద్ర వరం బయల్దేరి వెళతారు.