ఎరువుల దుకాణాల్లో కేంద్ర బృందం తనిఖీ
ABN , Publish Date - May 06 , 2026 | 12:45 AM
జిల్లాలో యూరియా, డీఏపీ నిల్వలు, అమ్మకాలపై ప్రభుత్వం దృష్టి సారిం చింది.
ఏలూరు సిటీ, చింతలపూడి, దెందులూరు, భీమడోలు, మే 5(ఆంధ్రజ్యోతి): జిల్లాలో యూరియా, డీఏపీ నిల్వలు, అమ్మకాలపై ప్రభుత్వం దృష్టి సారిం చింది. జిల్లాలోని ఏలూరు, ఉంగుటూరు, భీమడోలు, దెందులూరు, చింతల పూడి మండలాల్లో కేంద్ర బృందం మంగళవారం ఎరువుల దుకాణాలు తనిఖీ చేసినట్లు జిల్లా వ్యవసాయ శాఖ జేడీ షేక్ హబీబ్ బాషా తెలిపారు. న్యూఢిల్లీ డిప్యూటి డైరక్టర్ ఆఫ్ ఫెర్టిలైజర్స్ రవీంద్ర యాదవ్, హైదరాబాద్ ఎక్స్టెన్షన్ ఎడ్యుకేషన్ ఇనిస్టిట్యూట్ ప్రొఫెసర్ డి.మధుశేఖర్ తనిఖీ చేశారు. డీలర్ల వద్ద స్టాక్, విక్రయ రికార్డులు, బిల్లులు, రైతులకు సరఫరా విధానం తదితర ఆంశాలను పరిశీలించారు. ఎరువుల నిల్వలు సమృద్దిగా ఉండాలని, అక్రమ రవాణా, నిల్వలు, అధిక ధరలకు అమ్మకాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కేంద్ర బృందం అధికారులకు సూచిం చింది. రైతులకు ఎరువులు సరైన సమయంలో, సరైన మోతాదులో అందేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రైతులు అవసరమైన మేరకు మాత్రమే ఎరువులను కొనుగోలు చేయాలని తెలిపారు.
చింతలపూడి డీసీఎంఎస్‌లో ఎరువుల అమ్మకాలు, ధరలు, గోడౌన్లలో నిల్వలు, ఈపోస్ అమ్మకాలు, స్టాక్ రిజిష్టర్లు, భౌతిక నిల్వలను పరిశీలించి మూడేళ్ల అమ్మ కాల వివరాలను సేకరించారు. చింతలపూడి వ్యవసా య డివిజన్‌లో పంటలకు యూరియా వినియోగంపై వివరాలు అడిగి తెలుసుకు న్నారు. దెందులూరు సొసైటీలో యూరియా అమ్మకాలు, నిల్వలను తనీఖీ చేశారు. భీమడోలు మన గ్రోమోర్ షాపులో రికార్డులను పరిశీ లించి ఎరువులు రైతులకు సకాలంలో అందుతున్నాయా, యూరియా వ్యవసాయా నికి కాకుండా పరిశ్రమలకు వాడుతున్నారా అని దుకాణం నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. గత మూడు సంవత్సరాలుగా యూరియా పంపిణీలో వచ్చిన ఇబ్బందులను రైతులను అడిగారు. కేంద్ర బృందంతోపాటు ఏడీఏ వై.సుబ్బారావు, ఏవో మురళీకృష్ణ, దామా వెంకటేశ్వర్లు, ఏడీఏ అనిలకుమారి, ఏవో ఎల్.శ్రీనివాసరాజు, ఇన్‌చార్జి ఏడీఏ చెన్న కేశవులు, ఏవో వెంకటేశ్వరరావు, భీమడోలు ఏవో ఉషారాణి పాల్గొన్నారు.