Share News

ఇంటి లెక్క తేలుద్దాం..!

ABN , Publish Date - Mar 01 , 2026 | 12:20 AM

వచ్చే ఏడాది జరిగే జనాభా లెక్కల సేకరణకు కసరత్తు మొదలైంది. 15 ఏళ్ల తర్వాత చేపట్ట బోయే ఈ సర్వేకు జిల్లా అధికారులు చర్యలు ప్రారంభించారు. ఇది రెండు విడతలుగా జరు గుతుంది.

ఇంటి లెక్క తేలుద్దాం..!

జనగణనకు కసరత్తు

మే 1 నుంచి హౌస్‌ లిస్టింగ్‌ సర్వే

ఈ నెల 3, 4, 5 తేదీల్లో సర్వేపై శిక్షణ

జిల్లా, మండలాల వారీగా అధికారుల నియామకం

ఏప్రిల్‌ 15 నుంచి సెల్ఫ్‌ ఎన్యూమరేషన్‌

యాప్‌లో మనమూ వివరాలు చెప్పవచ్చు

జిల్లా ప్రిన్సిపల్‌ సెన్సస్‌ అధికారిగా కలెక్టర్‌ నాగరాణి

భీమవరం టౌన్‌, ఫిబ్రవరి 28(ఆంరఽధజ్యోతి): వచ్చే ఏడాది జరిగే జనాభా లెక్కల సేకరణకు కసరత్తు మొదలైంది. 15 ఏళ్ల తర్వాత చేపట్ట బోయే ఈ సర్వేకు జిల్లా అధికారులు చర్యలు ప్రారంభించారు. ఇది రెండు విడతలుగా జరు గుతుంది. తొలుత ఇంటి లెక్కలు తేలుస్తారు. రెండో విడత జనాభా లెక్కలను నమోదు చేస్తారు. మే ఒకటో తేదీ నుంచి హౌస్‌ హోల్డ్‌ సర్వే చేపడతారు. అక్టోబరు నాటికి ఇది పూర్తికావాలి.

మొదటగా హౌస్‌ లిస్టింగ్‌ సెన్సన్‌

జనాభా లెక్కల్లో భాగంగా మొదటిగా మే మొదటి వారం నుంచి హౌస్‌ లిస్టింగ్‌ సెన్సస్‌ ప్రారంభం కానుంది. ప్రతీ గ్రామం, పట్టణంలో ఇళ్ల పరిస్థితిపై సర్వే చేపడతారు. ఇళ్లు, గోడల స్వరూపం, పెంకుటిళ్లా, తాటాకు ఇళ్లా ? బాత్‌ రూమ్స్‌ ఉన్నాయా ? అవి ఏ విధమైనవి ? నీటి సరఫరా వుందా ? ఎలా అందుతోంది ? ఇంటి లో ఎంతమంది ఉంటున్నారు ? మహిళలు ఎంత మంది ? పురుషులు ఎంత మంది ? ట్రాన్స్‌జెండరా ఉన్నారా ? ఇలా దాదాపు 30 ప్రశ్నలకు సమాధానాలను నమోదు చేస్తారు. ఈ సర్వే జిల్లాలో మే నెలాఖరులోగా పూర్తి చేయాలి. ఈ సర్వే కచ్చితంగా సమాచారం ఇవ్వాల్సి వుంటుంది. జనాభా లెక్కల సర్వే అంతా డిజిటల్‌ విధానంలో సెల్‌ఫోన్ల ద్వారా చేపడతారు. 2011లో ప్రత్యేకచార్టు ద్వారా వివరాలను నమోదు చేశారు. దీనివల్ల ఎన్నో ఇబ్బందులు రావటం, లెక్కలు కట్టడం ఇబ్బందిగా మారింది. మారిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి సర్వే చేపట్టనున్నారు.

మూడు రోజులపాటు శిక్షణ

మే 1వ తేదీ నుంచి నిర్వహించే హౌస్‌ హోల్డింగ్‌ సర్వేపై అధికారులకు ఈ నెల 3, 4, 5 తేదీల్లో ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని శిక్షణ ఇస్తారు. ఢిల్లీలోని డైరెక్టర్‌ ఆఫ్‌ సెన్సస్‌ కార్యాలయం నుంచి

అఽఽధికారుల నియామకం

జిల్లాలోని 20 మండలాలు, ఆరు మునిసిపాల్టీలకు సంబంధించి మండలానికి నలుగురు అధికారుల చొప్పున 104 మందిని నియమించారు.

జిల్లాకు ప్రిన్సిపల్‌ సెన్సస్‌ ఆఫీసర్‌గా కలెక్టర్‌ నాగరాణి, అడిషనల్‌ సెన్సస్‌ ఆఫీసర్‌గా జేసీ రాహుల్‌కుమార్‌రెడ్డి, జిల్లా సెన్సస్‌ ఆఫీసర్‌గా డీఆర్వో శివనారాయణరెడ్డి వ్యవహరిస్తారు. వీరికి అడిషన్‌ సెన్సస్‌ ఆఫీసర్లుగా వివిధ శాఖల అధికారులు వుంటారు.

మూడు సబ్‌ డివిజనల్‌కు డిప్యూటీ డివిజనల్‌ సెన్సస్‌ ఆఫీసర్లుగా ఆర్డీవోలను నియమించారు. ఛార్జీ సెన్సస్‌ ఆఫీసర్లుగా మునిసిపాల్టీలకు కమీషనర్లు, మండలాలకు తహసిల్ధార్లు, వారికి అడిషనల్‌ ఛార్జీ ఆఫీసర్లుగా ఎంపీడీవోలకు బాధ్యతలు అప్పగించారు.

800 మంది జనాభాకు ఒక బాక్ల్‌.. జిల్లాలో మూడు వేల 277 బ్లాక్‌లు వున్నాయి.

మూడు వేల 169 మంది ఎన్యూమరేటర్లు, 544 మంది సర్కిల్‌ సూపర్‌వైజర్లను నియమించనున్నారు.

2011 జనాభా లెక్కల ప్రకారం.. జిల్లాలో 18,45,029 మంది ఉన్నారు. 2026 నాటికి ఈ సంఖ్య 20,78,505కు చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Updated Date - Mar 01 , 2026 | 12:20 AM