Share News

జనగణనపై శిక్షణ

ABN , Publish Date - Apr 10 , 2026 | 12:00 AM

జిల్లాలో త్వరలో ప్రారంభమయ్యే జనాభా గణనపై 30 చోట్ల శిక్షణ కార్య క్రమాలు గురువారం ప్రారంభమయ్యాయి.

జనగణనపై శిక్షణ
ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్లకు శిక్షణ

30చోట్ల శిక్షణ కార్యక్రమాలు

16 నుంచి స్వీయ గణన.. 3,381 బ్లాక్‌లు.. 3,528 ఎన్యూమరేటర్లు.. 620 మంది సూపర్‌వైజర్లు

ఏలూరు, ఏప్రిల్‌ 9(ఆంధ్రజ్యోతి): జిల్లాలో త్వరలో ప్రారంభమయ్యే జనాభా గణనపై 30 చోట్ల శిక్షణ కార్య క్రమాలు గురువారం ప్రారంభమయ్యాయి. మాస్టర్‌ ట్రైనీల ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సిన విధి విధానాలపై ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్లకు మూడు రోజుల పాటు ఈ శిక్షణ జరుగుతుంది. ఈ మేరకు జిల్లాను 3,381 బ్లాక్‌లుగా విభజించి జనాభా గణన చేపడతారు. 3,528 ఎన్యూమరేటర్లు (సచివాల య సిబ్బంది), సూపర్‌వైజర్లుగా (మండల అధికారులు, సీనియర్‌ అసిస్టెంట్‌)లను 620 మందిని జిల్లా యంత్రాంగం నియమించింది. ఏప్రిల్‌ 16 నుంచి 30వ తేదీ వరకు స్వీయగణన జరుగుతుంది. ఇంటి యజమానే యాప్‌లోకి వెళ్లి వివరాలను నమోదు చేసుకోవచ్చు. ఎన్యూమరేటర్లు విధిగా ఆ ఇంటిని సందర్శించినప్పుడు ఐడీని ప్రజలు అందించాల్సి ఉంటుంది. మే ఒకటో తేదీ నుంచి 30వ తేదీ వరకు ఇళ్ల జాబితా, ఇళ్ల గణన చేపడతారు. జరగబోయే జనాభా గణనలోకి ప్రజలు భాగ స్వామ్యులు కావాలని, మీ ఇళ్ల వివరాలను సక్రమంగా ఇవ్వాలని, వివరాలు గోప్యంగా ఉంచబడతాయని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ సెన్సస్‌ ఆపరేషన్‌ విభాగం ప్రచార కార్యక్రమం చేపట్టింది.

Updated Date - Apr 10 , 2026 | 12:01 AM