Share News

జనాభా ఎంత?

ABN , Publish Date - Feb 27 , 2026 | 12:28 AM

ప్రజల జీవన ప్రమాణాలను మార్చేందుకు ఉద్దే శించిన పథకాల రూపకల్పనకు జనాభా లెక్కలే కీలకం. సాధారణంగా ప్రతి పదేళ్లకొకసారి జనాభా గణన జరగాలి. చివరిసారిగా 2011లో నిర్వహిం చారు. 2021లో జనగణన కరోనా కారణంగా జరగలేదు. జిల్లాల విభజన అనంతరం తొలిసారిగా ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి చేపట్టనున్న జనగణనకు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి.

 జనాభా ఎంత?

ఏప్రిల్‌ నుంచి జనగణన

జిల్లాలో చురుగ్గా ఏర్పాట్లు

తహసీల్దారు, ఎంపీడీవోల శిక్షణ పూర్తి

త్వరలో ఎన్యూమరేటర్ల నియామకం

(ఏలూరు–ఆంధ్రజ్యోతి)

ప్రజల జీవన ప్రమాణాలను మార్చేందుకు ఉద్దే శించిన పథకాల రూపకల్పనకు జనాభా లెక్కలే కీలకం. సాధారణంగా ప్రతి పదేళ్లకొకసారి జనాభా గణన జరగాలి. చివరిసారిగా 2011లో నిర్వహిం చారు. 2021లో జనగణన కరోనా కారణంగా జరగలేదు. జిల్లాల విభజన అనంతరం తొలిసారిగా ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి చేపట్టనున్న జనగణనకు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి.

జిల్లాలో తొలుత గృహాలు, ఆయా కుటుంబా ల్లోని సభ్యుల నమోదుకు కేంద్రం నోటిఫికేషన్‌ జారీ చేసింది. మొదటి దశలో ప్రతి నివాసానికి వెళ్లి ఇల్లు ఏ తరహా నిర్మాణం, వంటగది, మరుగు దొడ్డి, ఏయే పరికరాలు ఉన్నాయి..తదితర 32 ప్రశ్నలకు జవాబులు నమోదు చేస్తారు. ఒక్కొ ఎన్యూమరేటర్‌కు 200 గృహాలు కేటాయించారు. ఏప్రిల్‌ 1 నుంచి ప్రత్యేక యాప్‌లో కుటుంబ వివ రాలన్నీ వ్యక్తిగతంగా నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. మే1 నుంచి నెలాఖరులోగా ఎన్యు మరేటర్లు వారి పరిధిలో ఇంటింటా తిరిగి పూర్తి వివరాలను సేకరించనున్నారు. అదే సమయంలో వ్యక్తిగత యాప్‌లో నమోదు చేసుకున్న వారి వివ రాలను పునః పరిశీలిస్తారు. ప్రతిఇంట్లో ఎంత మంది నివాసం ఉంటున్నారో నమోదు చేస్తారు.

అధికారులకు శిక్షణ పూర్తి

జిల్లా సెన్సస్‌ అధికారులుగా నియమితులైన అధికారులు, మండలాల్లో ఎంపీడీవో, తహసీల్దార్‌, మునిసిపల్‌ కమిషనర్లకు ఢిల్లీ నుంచి వచ్చిన నేషనల్‌ ట్రైనర్‌ చంద్రకళ కలెక్టరేట్‌లోని గోదావరి సమావేశం మందిరంలో ఈనెల 24 నుంచి 26వ తేదీ వరకు గురువారం వరకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమాలు ముగిశాయి.

ఎన్యూమరేటర్ల నియామకాలకు కసరత్తు

శిక్షణ పూర్తి చేసుకున్న అధికారులు మండలా ల్లో ఎన్యుమరేటర్ల నియామకాలకు ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. దాదాపుగా మూడువేల మం దికి పైగా ఎన్యూమరేటర్లు నియమాకం చేయాల్సి ఉంటుంది. వీరిపై సూపర్‌వైజర్లను నియమించే బాధ్యత తహసీల్దార్లు, ఎంపీడీవోలకు ఉంటుంది. వీరు 400 మందికి పైగా అవసరం ఉంటుందని అంచనా వేశారు. రాబోయే రోజుల్లో వీరి నియామ కాలను చేపడతారు. వీరికి మళ్లీ శిక్షణ కార్యక్రమా లుంటాయి. వీరికి మాస్టర్‌ ట్రైనీలు శిక్షణ ఇచ్చి క్షేత్రస్థాయిలో ఏవిధంగా జనగణన చేయాల్సిందీ దిశా నిర్దేశకత్వం చేస్తారు.

Updated Date - Feb 27 , 2026 | 12:28 AM