వైసీపీ మాజీ సర్పంచ్‌పై కేసు నమోదు
ABN , Publish Date - Jul 25 , 2026 | 12:27 AM
కైకలూరు మండలం నత్తగుల్లపాడు వైసీపీ మాజీ సర్పంచ్ ముంగర రామకృష్ణంరాజుపై కైకలూరు రూరల్ ఎస్సై వి.రాంబాబు శుక్రవారం కేసు నమోదు చేశారు.
కైకలూరు, జూలై 24(ఆంధ్రజ్యోతి): కైకలూరు మండలం నత్తగుల్లపాడు వైసీపీ మాజీ సర్పంచ్ ముంగర రామకృష్ణంరాజుపై కైకలూరు రూరల్ ఎస్సై వి.రాంబాబు శుక్రవారం కేసు నమోదు చేశారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం మాజీ సర్పంచ్ కొల్లేరుపై సీఈసీ కమిటీ సూచనలను వక్రీకరిస్తూ సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు చేసినట్టు తెలిపారు. వాటిలో కొల్లేరు గ్రామాల పెద్దలను అసభ్యకరమైన పదాలు, వ్యక్తిగత దూషణలకు రామకృష్ణంరాజు పాల్పడ్డాడన్నారు. వాటితో పాటు వాట్సాప్ గ్రూపులలో మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా పోస్టులు పెట్టాడని అదే గ్రామానికి చెందిన నబిగారి ఏడుకొండలు ఫిర్యాదు చేయడంతో శుక్రవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.