14 మంది టీడీపీ నాయకులపై ఎన్నికల కేసు కొట్టివేత
ABN , Publish Date - Feb 28 , 2026 | 12:51 AM
టీడీపీ నాయకులపై 2019 ఎన్నికల సమయంలో పెట్టిన కేసును కొట్టివేస్తూ నూజివీడు కోర్టు శుక్రవారం తీర్పు ఇచ్చింది.
చాట్రాయి, ఫిబ్రవరి 27(ఆంధ్రజ్యోతి): టీడీపీ నాయకులపై 2019 ఎన్నికల సమయంలో పెట్టిన కేసును కొట్టివేస్తూ నూజివీడు కోర్టు శుక్రవారం తీర్పు ఇచ్చింది. దీనికి సంబంధించిన వివరాలివి.. మండలానికి చెందిన టీడీపీ నాయకులు మందలపు జగదీష్ (చీపురుగూడెం), చాగంటి రాధాకృష్ణ (పోలవరం)లతో సహా నూజివీడు నియోజకవర్గం పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన 14 మంది టీడీపీ నాయకులు ఎన్నికల నిబంధనలు అతిక్రమించారని 2019 ఎన్నికల్లో కేసు నమోదైంది. అప్పటి నుంచి ఈ కేసు విచారణ జరుగుతోంది. ఈ కేసు విషయమై నూజివీడు ఎమ్మెల్యే, మంత్రి కొలుసు పార్థసారథి చొరవ తీసుకొని పీపీతో మాట్లాడడంతో విచారణ వేగంగా పూర్తి చేశారు. కేసును కొట్టి వేస్తూ నూజివీడు కోర్టు తీర్పు ఇవ్వడంతో టీడీపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.