ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో కరోనా వార్డు ఏర్పాటు
ABN , Publish Date - Jul 12 , 2026 | 12:35 AM
కడప జిల్లాలో కరోనా కేసు నమోదు కావ డంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.
ఏలూరు క్రైం, జూలై 11 (ఆంధ్రజ్యోతి) : కడప జిల్లాలో కరోనా కేసు నమోదు కావ డంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. దీంతో ఏలూరు ప్రభుత్వాసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్యామల ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో కొవిడ్ పది పడకలతో కూడిన కరోనా ప్రత్యేక వార్డును ఏర్పాటుకు శనివారం ఆదేశాలు ఇవ్వడంతో యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేశారు. ఆర్టీ–పీసీఆర్ కిట్లు, రెమిడిసెవర్ ఇంజక్షన్లు, పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్యూప్‌మెంట్ కిట్స్, ఎన్–95 మాస్కులు, సెంట్రల్ ఆక్సిజన్‌తో సౌకర్యం ఉన్న పది పడకలను ఏర్పాటు చేశారు. అంతే కాకుండా అందుకు అవసరమైన వైద్యులు, నర్సులు, ఫార్మసీ సిబ్బంది, ల్యాబ్ సిబ్బందిని ప్రత్యేక విధులు నిర్వర్తించడానికి ఏర్పాటు చేశారు.