పోణంగిలో పోలీసుల కార్డన్ సెర్చ్
ABN , Publish Date - Mar 06 , 2026 | 12:31 AM
మాదకద్రవ్యాల రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా జిల్లా ఎస్పీ కేపీఎస్ కిషోర్ ఆదేశాలతో ‘ఆపరేషన్ వజ్ర పహార్’ పేరుతో ఏలూరు రూరల్ మండలం పోణంగి రోడ్డులోని వైఎస్‌ఆర్ కాలనీలో గురువారం తెల్లవారు జామున కార్డన్ సెర్చ్ నిర్వహించారు.
పోణంగిలో పోలీసుల కార్డన్ సెర్చ్
ఏలూరు క్రైం, మార్చి 5(ఆంధ్రజ్యోతి): మాదకద్రవ్యాల రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా జిల్లా ఎస్పీ కేపీఎస్ కిషోర్ ఆదేశాలతో ‘ఆపరేషన్ వజ్ర పహార్’ పేరుతో ఏలూరు రూరల్ మండలం పోణంగి రోడ్డులోని వైఎస్‌ఆర్ కాలనీలో గురువారం తెల్లవారు జామున కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఏలూరు డీఎస్పీ డి.శ్రావణ్ కుమార్ పర్యవేక్షణలో ఏలూరులోని సీఐలు జి.సత్యనారాయణ, కె.అశోక్ కుమార్, ఎస్.కోటేశ్వర రావు, ఈగల్ టీమ్ ఆర్‌ఎస్‌ఐ ఉదయ భాస్కర్, 50 మంది పోలీస్ సిబ్బందితో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని 14 మోటారు సైకిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రజలకు పలు అవగాహనలు కల్పించారు. ఎవరైనా గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలు విక్రయించినా, కలిగి ఉన్నా పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని వెల్లడించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిని, అక్రమ వ్యాపారాలు చేసే వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని అధికారులు హెచ్చరించారు.