కాలువ పనులకు సిద్ధం
ABN , Publish Date - Feb 27 , 2026 | 12:16 AM
జలవనరుల శాఖలో వేసవి పనులకు ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. పశ్చిమ డెల్టా పరిధిలో రూ. 50 కోట్లు విలువైన పనులు చేపట్టాలని ప్రణాళిక చేశారు. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.
జిల్లాలో రూ.50 కోట్లతో ప్రతిపాదనలు
నామినేషన్ పనులకే ప్రతిపాదన
ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన అధికారులు
డ్రెయిన్లు, కాలువల్లో తూడు, గుర్రపు డెక్క తొలగింపు
పూడిక తీత, షట్టర్లు, స్లూయిస్ మరమ్మతులు
అనుమతులే తరువాయి
(భీమవరం–ఆంధ్రజ్యోతి)
జలవనరుల శాఖలో వేసవి పనులకు ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. పశ్చిమ డెల్టా పరిధిలో రూ. 50 కోట్లు విలువైన పనులు చేపట్టాలని ప్రణాళిక చేశారు. ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. నీటి సంఘాల నుంచి మార్చి మాసాంతం వరకు వచ్చే ప్రతిపాదనలను కూడా ప్రభు త్వానికి సమర్పించేందుకు జిల్లా జల వన రుల శాఖ అధికారులు కార్యాచరణ రూపొందించారు. ఈ ఏడాది వేసవిలో తూడు, గుర్రపు డెక్క తొలగింపుతో పాటు పూడిక తీత పనులను చేపట్టాలని సంకల్పించారు. షట్టర్లు, స్లూయిస్‌లు, లాకుల మరమ్మతులకు ప్రతి పాదనలు రూపొందించారు. పంటకాలువలకు రూ. 25 కోట్లు, మురుగు కాలువలకు మరో రూ. 25 కోట్లతో పనులు నిర్వహించేలా ప్రణాళిక చేశారు. ప్రభుత్వం ఇచ్చే నిధులపైనే పనులు ఆధారపడనున్నాయి. గత ఏడాది పంపిన ప్రతిపాదనలకు సంబంధించి ప్రభుత్వం అప్పట్లో 50 శాతం నిధులను మాత్రమే కేటాయించింది. వాటితోనే పనులు చేపట్టారు. ఈ ఏడాది వేసవిలో ప్రభుత్వమే ముందస్తుగా ప్రతి పాదనలు పంపాలని ఆదేశాలు జారీ చేసింది. ఆ మేరకు అంచనాలు వేశారు. నీటి సంఘాలు కోరిన పనులకు అంచ నాలు వేసి ప్రభుత్వానికి సమర్పించారు.
అన్ని పనులు రూ.10 లక్షల లోపే
ప్రభుత్వం వేసవి పనులకు అను మతులు జారీ చేయడంలో జాప్యం జరుగు తోంది, టెండర్ల ప్రక్రియ చేపడితే మరింత కాలవ్యవధి అవసరం కానుంది. వర్షాలు కురిస్తే పూడిక తీత పనులు ఇబ్బంది కరంగా మారనున్నాయి. దీనిని పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం నామినేషన్‌పై పనులు కేటాయించే విలువను పెంచింది. గతంలో రూ. 5లక్షల వరకు నామి నేషన్‌పై పనులు కేటాయించేవారు. ఈ ఏడాది దానిని రూ. 10 లక్షలకు పెంచారు. అందుకు తగ్గట్టుగానే జిల్లా అధికారులు ప్రతిపాదనలు చేస్తున్నారు. పనుల నిడివి తగ్గిస్తున్నారు. నామినేషన్ కేటాయింపులకు అనుగుణంగానే రూ.10 లక్షల లోపు పను లను గుర్తిస్తున్నారు. పెద్ద పనులు అయితే విభజిస్తున్నారు. మొత్తంపైన నామినేషన్ పద్ధతిలో పనులు మంజూరు చేయను న్నారు. నీటి సంఘాల ఆధ్వర్యంలోనే నిర్వహించేలా సన్నాహాలు చేస్తున్నారు.
టెండర్‌లకు స్వస్తి
గడచిన వేసవిలో మంజూరు చేసిన పనులను మార్చి మాసాంతం వరకు చేపట్టనున్నారు. ముఖ్యంగా తూడు, గుర్రపు డెక్క పనులను నిర ంతరం చేపట్టాల్సి ఉంటుంది. రైతులకు సాగునీటి సరఫరాలో అవరోధాలు లేకుండా, ముంపు బెడద నుంచి గట్టిక్కించే పనులను ఏడాది పొడవునా చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాతే ప్రభుత్వం బిల్లులు మంజూరు చేస్తుంది. గడచిన వేసవిలో ప్రాజెక్ట్ కమిటీలు, డిస్ర్టిబ్యూటరీ కమిటీలు అధికంగా పనులు నిర్వహించారు. నీటి వినియోగదారుల సంఘాలు సైతం తమ పరిధిలో పనులు చేపట్టేందుకు ఆసక్తి చూపాయి. ఈ సారి వేసవిలోనూ నీటి సంఘాలు పనులు చేపట్టాలన్న తలంపుతో ఉన్నాయి.