Share News

ఇదేం తీరు!

ABN , Publish Date - Jun 19 , 2026 | 12:32 AM

ఏలూరు పరిసర ప్రాంతాల్లోని పంట కాలువల్లో పేరుకుపోయిన గుర్రపుడెక్క (వాటర్‌ హయాసింత్‌) తొలగింపు కోసం నీటిపారుదల శాఖ డ్రోన్‌ ద్వారా మందు పిచికారీ చేస్తోంది.

ఇదేం తీరు!
డ్రోన్‌ ద్వారా తమ్మిలేరులో మందు పిచికారీ చేస్తున్న దృశ్యం

వర్షాలు మొదలవ్వగానే..పంట కాలువల్లో కలుపు మందు పిచికారీ

మేలు కంటే కీడే ఎక్కువంటున్న రైతులు

ఏలూరు రూరల్‌, జూన్‌ 18(ఆంధ్రజ్యోతి): ఏలూరు పరిసర ప్రాంతాల్లోని పంట కాలువల్లో పేరుకుపోయిన గుర్రపుడెక్క (వాటర్‌ హయాసింత్‌) తొలగింపు కోసం నీటిపారుదల శాఖ డ్రోన్‌ ద్వారా మందు పిచికారీ చేస్తోంది. అయితే ఈ ప్రక్రియను వర్షాకాలానికి ముందే చేపట్టాల్సి ఉండగా, వర్షాలు ప్రారంభమైన తర్వాత చేపట్టడంపై రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా వేసవి చివరిలో లేదా వర్షాకాలానికి ముందే కలుపు మొక్కలను నిర్మూ లిస్తే మందు ప్రభావం ఎక్కువ కాలం ఉంటుంది. వర్షాకాలంలో పిచికారీ చేయడం వల్ల వర్షపునీటి తో మందు ప్రభావం తగ్గిపోవడమే కాకుండా, చనిపోయిన గుర్రపు డెక్క నీటి ప్రవాహంతో మరో ప్రాంతాలకు కొట్టుకుపోయి తిరిగి కాలువల్లో వ్యాపించే అవకాశం ఉంటుందని రైతులు పేర్కొం టున్నారు. ఏటా కొంతమేర మాత్రమే పిచికారీ చేసి పనులను మధ్యలోనే ఆపేస్తున్నారు. దీంతో ప్రభుత్వ నిధులు వృథా కావడంతో పాటు కాలు వలు పూర్తిగా శుభ్రం కాకపోవడం వల్ల సాగునీటి ప్రవాహానికి ఆటంకం కలుగుతోందని రైతులు అంటున్నారు.

ఎందుకు ఆలస్యం చేస్తున్నారు?

ముందస్తుగా చేపట్టాల్సిన పనులను ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? అనే ప్రశ్నలు రైతుల నుంచి వినిపిస్తున్నాయి. గుర్రపుడెక్క, కర్రనాచు వర్షాకాలానికి ముందే తొలగించాలని ఉన్నతాధి కారులు సూచిస్తున్నా ఏటా వర్షాలు ప్రాంభమైన తర్వాతే పనులు చేపట్టడం ఆనవాయితీగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముంద స్తుగా చేపట్టాల్సిన పనులను ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తున్నారనే విమర్శలున్నాయి. వర్షా కాలంలో కలుపు మందు పిచికారీ చేయడం వల్ల ఆ రసాయనం కలిసిన నీరు పంట పొలాలు, చెరువులు, భూగర్భ జలాల్లోకి చేరే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నీటిని తాగునీటిగా లేదా ఇతర అవసరా లకు వినియోగిస్తే ప్రజల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉందని, దీర్ఘకాలంలో కేన్సర్‌ వంటి తీవ్ర వ్యాధులు వచ్చే అవకాశాలపై భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - Jun 19 , 2026 | 12:32 AM