13న సీఎం పోలవరం రాక
ABN , Publish Date - Jul 09 , 2026 | 12:30 AM
సీఎం చంద్రబాబునాయుడు ఈ నెల 13న పోల వరం ప్రాజెక్ట్ పనుల పరిశీలనకు రానున్నారు.
ఏర్పాట్లపై కలెక్టర్ పరిశీలన
ఏలూరు, పోలవరం, జూలై 8(ఆంధ్రజ్యోతి): సీఎం చంద్రబాబునాయుడు ఈ నెల 13న పోల వరం ప్రాజెక్ట్ పనుల పరిశీలనకు రానున్నారు. ఈ మేరకు జలవనరులశాఖ నుంచి ఏర్పాట్లు చేయాల్సిందీగా కలెక్టరేట్ అధికారులకు అఽధికారికంగా బుధవారం సమాచారం అందింది. సీఎం పర్యటించనున్న ఈసీఆర్‌ఎఫ్ డ్యాం, పవర్ హౌస్, యూనిట్ టర్బైన్ల నిర్మాణ ప్రాంతాలను, హెలీప్యాడ్‌ను కలెక్టర్ వెట్రిసెల్వి బుధవారం పరిశీలించారు. ఏర్పాట్లపై సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పనుల పురోగతిపై ఫొటో ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేయాలని సూచించారు. కలెక్టర్ వెంట జేసీ అభిషేక్ గౌడ, ఆర్డీవో ఎంవీ.రమణ, ప్రాజెక్టు అథారిటీ సీఈ రమేశ్‌కుమార్, ఈఈలు డి.శ్రీనివాసు, పీవీ.వెంకటరమణ, డీఈ మాధవరావు, తదితరులు పాల్గొన్నారు.
స్నాన ఘట్టాల పరిశీలన
గోదావరి పుష్కర స్నాన ఘట్టాల ఏర్పాట్లలో లోటుపాట్లు లేకుండా చూడాలని కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులకు సూచించారు. పట్టిసీమ, పోలవరంలలో స్నానాల ఘాట్లను అధికారులతో కలిసి బుధవారం పరిశీలించారు. భక్తుల రద్దీకి తగినట్లు మౌలిక వసతుల ఏర్పాట్లు చేయాలని సూచించారు.