మినీ బైపాస్.. హైజాక్
ABN , Publish Date - Apr 17 , 2026 | 11:46 PM
ఏలూరులో పాతబస్టాండ్ మొదలుకుని మినీ బైపాస్ వరకు రోడ్డు పరిసరాలు, మార్జిన్‌లు ఆక్రమణల కోరల్లో చిక్కుకుంటున్నాయి. కబ్జాలకు గురయ్యాయి.
కబ్జా కోరల్లో రోడ్లు
ఏలూరులో ఎడాపెడా ఆక్రమణలే..
ఇష్టారాజ్యంగా కార్లు, ట్రావెల్ బస్సుల నిలుపుదల
పట్టని టౌన్‌ప్లానింగ్.. ట్రాఫిక్ శాఖలు
ఏలూరు,ఏప్రిల్ 17(ఆంధ్రజ్యోతి):
ఏలూరులో పాతబస్టాండ్ మొదలుకుని మినీ బైపాస్ వరకు రోడ్డు పరిసరాలు, మార్జిన్‌లు ఆక్రమణల కోరల్లో చిక్కుకుంటున్నాయి. కబ్జాలకు గురయ్యాయి. ఇటువైపుగా మూడు కిలోమీటర్ల మేర ఎడాపెడా వాహనాల నిలుపు దల, ద్విచక్ర వాహనాల షాపుల వద్ద వారి వాహనాలతో అడుగుతీసి అడుగు వేయని పరిస్థితి. నగర జనాభా పెరిగినప్పటికి దానికి తగ్గట్టుగా ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్ లేక వాహనాల నిలుపుదలతో ప్రజలు ప్రమాదాల పాలయ్యే దుస్థితి నెలకొంది.
ఏలూరు నగరం లో ప్రధానంగా మెయిన్ రోడ్లు ఆక్రమణల కోరల్లో బక్కచిక్కుతున్నాయి. రోడు ్డమార్జిన్లు, ఫుట్‌పాత్‌లు దాటి తమ వ్యాపారాలను సాగిస్తుండడంతో ప్రజలు ప్రత్యక్షంగా ట్రాఫిక్‌తో నరకం చూస్తున్నారు. కాదేది కబ్జాకు అనర్హం అంటూ పచ్చని పార్కులను సైతం కబళించేసి కార్లు.. మినీవ్యానులతో కృష్ణా కాల్వ పరి సరాలను నామరూపాల్లేకుండా ఆక్రమించేశారు. అను మతి లేని కార్లు, మినీ వ్యాన్ స్టాండ్లు ఇక్కడ వెలిసినా అటువైపు ట్రాఫిక్ అధికారులు కన్నెత్తి చూడడం లేదు.
మినీ బైపాస్ నామరూపల్లేకుండా..
రైల్వేగేటు ఇబ్బందులు లేకుండా ఏలూరులో 2000 సంవత్సరానికి ముందుగా మినీ బైపాస్ ఏర్పడింది. టౌన్ మధ్యలో వాహనాల రద్దీ నివారణకు ఇది ఏర్పాటు చేయగా.. ఇటువైపుగా జూట్‌మిల్లు పరిసరా ల నుంచి అటు గ్రీన్‌సిటీ వంతెన వరకు ఎడాపెడా బైపాస్‌కు రెండు వైపులా ఆక్రమణలు భారీగా వెలిశా యి. మార్జిన్లను సైతం కబళించేసి లారీలు, హైటెక్ బస్సులు, కార్లు, మినీ వ్యాన్లు, హైటెక్ టిఫిన్లు బండ్లు ఇలా అన్ని రకాల వాహనాలను నిలుపుదల చేస్తున్నా రు. రామకృష్ణాపురం, పోస్టల్ కాలనీ పరిసరాల ప్రజ లు ఈ వాహనాల రద్దీతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొం టున్నారు. ఉదయం, రాత్రి అనే తేడా లేకుండా భారీ వాహనాల వల్ల కృష్ణా కాల్వగట్లు మొత్తం పాడవు తున్నాయి. రామకృష్ణాపురం పరిసరాల్లో కార్ల మరమ్మ తులను రోడ్లపైనే సాగిస్తున్నారు. దీనికి తోడు వాహ నాలను ఇక్కడే కడగటం వల్ల కాల్వ నీరు కలుషితమ వుతోంది. ఇది సమీప గ్రామాల ప్రజలకు తాగునీరుగా ఉపయోగపడాల్సి ఉంది.
దర్జాగా ఫుట్‌పాత్‌ల కబ్జా
కర్రల వంతెన మొదలు బీఎస్‌ఎన్‌ఎల్ జిల్లా కార్యాలయం వరకు ఫుట్‌పాత్‌లన్నీ ఆక్రమణలకు గురయ్యాయి. మూడు మీటర్లు ముందుకు జరిపి ఇక్కడ ఫుట్‌పాత్‌ల పైకి వచ్చేలా భవనాలు నిర్మిం చినా అటువైపు టౌన్‌ప్లానింగ్ అధికారులు కన్నెత్తి చూడడం లేదు. వసంత్‌మహల్ సెంటర్‌లో లక్షలాది రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన పుట్ పాత్ లను ఆక్రమించేశారు.
కన్నెత్తి చూడని ట్రాఫిక్ అధికారులు
ఇష్టారాజ్యంగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు రాత్రి, పగలు మినీ బైపాస్‌లో ఇతర ప్రయాణాలకు అడ్డుగా ఉన్నా.. ఎప్పుడు ఇటువైపు ట్రాఫిక్ అధికారులు కన్నెత్తి చూడడం లేదు. ట్రాఫిక్ నియంత్రణకు ఒక కార్యా చరణ రూపొందించి.. అన్ని శాఖల సమన్వయంతో ఆక్రమణలను తొలగించాలని నగరవాసులు కోరుతు న్నారు.