అవస్థల ప్రయాణం!
ABN , Publish Date - Aug 29 , 2026 | 12:45 AM
జిల్లా కేంద్రమైన ఏలూరు ఆర్డీసీ డిపో నుంచి ప్రయాణం అవస్థలతో కూడుకున్న ప్రయాసగా ఉంది. రద్దీకి తగ్గట్టుగా బస్సు సర్వీసుల్లేక ప్రయా ణికుల ఇక్కట్లు నడుమ రాకపోకలు సాగిస్తున్నారు. కీలకమైన సాయంత్రం వేళల్లో విద్యార్థులు గమ్య స్థానాలకు చేరేందుకు అవస్థలు పడుతున్నారు.
ఏలూరు బస్టాండ్లు కిటకిట!
ఓ వైపు రాఖీ... మరోవైపు పెళ్లిళ్లు
రద్దీకి త గ్గ బస్సుల్లేక ఇక్కట్ల పాలు
విజయవాడ కు ప్రయాణం గగనమే
(ఏలూరు–ఆంధ్రజ్యోతి) :
జిల్లా కేంద్రమైన ఏలూరు ఆర్డీసీ డిపో నుంచి ప్రయాణం అవస్థలతో కూడుకున్న ప్రయాసగా ఉంది. రద్దీకి తగ్గట్టుగా బస్సు సర్వీసుల్లేక ప్రయా ణికుల ఇక్కట్లు నడుమ రాకపోకలు సాగిస్తున్నారు. కీలకమైన సాయంత్రం వేళల్లో విద్యార్థులు గమ్య స్థానాలకు చేరేందుకు అవస్థలు పడుతున్నారు.
ఏలూరు ప్రధాన బస్టాండ్‌లో రాఖీ పండుగ రోజున శుక్రవారం సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య ప్రయాణికులు పడరాని పాట్లు పడ్డారు. ద్వారకాతిరుమల, రావులపాలెం, తాడేపల్లిగూడెం, చింతలపూడి రూట్‌ల్లో ప్రయా ణికులు, విద్యారుథలు బస్సులను ఎక్కడానికి పరుగులు పెట్టారు. బస్సు ప్లాట్‌ఫామ్‌పై రాక ముందే దాన్ని గమనించి ఎలాగైనా ఎక్కాలన్న ఆత్రుతతో ఫీట్లు చేశారు. డోర్ బయట ఫుట్‌పాత్‌పై వేలాడుతూ, ఒక్కరి కాళ్లపై మరొకరు నిలబడుతూ బస్సులు ఎక్కారు. మహిళలు సైతం రద్దీ బస్సుల్లోనే ఎక్కేందుకు ప్రయత్నిం చారు. ఉచిత ప్రయాణాలతో మహిళ ప్రయాణాలు విపరీతంగా పెరగడంతో శుక్ర, శనివారాల్లో రద్దీ తగ్గ ట్టుగా సర్వీసులు లేకపోవడం ప్రధాన సమస్యగా ఉంది. దీనికి తోడు పెళ్లిళ్లల ముహుర్తాలు ఎక్కువగా ఉండటంతో పాత బస్టాండ్, కొత్తబస్టాండ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపో యాయి. రాత్రి ఏడు గంటల వరకు ప్రయాణికులు పడరాని పాట్లు పడ్డారు. వాడపల్లి వెంకటేశ్వరస్వామి, చిన్న తిరుపతిలకు ప్రయాణాలను ఈ రెండు రోజుల్లో ఎక్కువగా చేస్తుండటంతో బస్సుల కిటకిటలాడుతున్నాయి. విజయవాడకు శుక్ర,శనివారాల్లో ప్రయాణం చేయాలంటే ప్రయాణికులకు చుక్కలు కనపడుతు న్నాయి. రాత్రి ఏడు గంటల నుంచి 9.30 గంటల వరకు ప్రయాసలు తప్పదు. రద్దీగా తగ్గట్టుగా బస్సు సర్వీసులను నాన్‌స్టాప్ కౌంటర్ నుంచి నడపలేకపోతున్నారు. మూడు బస్సుల సరిపడా ప్రయాణికులు వేచి ఉంటే ఒక బస్సు నడుస్తోంది. దీంతో బస్సుల కోసం కౌంటర్ వద్ద గంటన్నరకు పైగా నిల్చోవాల్సిన దుస్థితి. ఏలూరు బస్టాండ్ నుంచి 23 నాన్‌స్టాప్ బస్సు సర్వీసులను నాలుగు ట్రిపుల చొప్పున నడుపుతున్నా ప్రయాణికుల రద్దీకి సరిపోవడం లేదు. రాత్రి 7.15 దాటితే ఏలూరు పెద్ద రైల్వేస్టేషన్ నుంచి విజయవాడ వైపు రైళ్లు లేవు. ఈ సమయంలో తిరుమల ఎక్స్‌ప్రెస్ తప్ప రాత్రి 9 గంటల దాటే వరకు సూపర్ ఫాస్ట్ ట్రైన్లు గౌతమి, గోదావరిలే దిక్కు. ఇందులో జనరల్ బోగీలు పైస్టేషన్ల వద్దే నిండిపోతాయి. దీంతో ఇటు రైళ్లు లేక అటు బస్సు ప్రయాణం గగనంగా మారడంతో ప్రయాణికులు నరకం చూస్తున్నారు. బస్సు కౌంటర్ ఒక్కటే ఉండటం రెండు బస్సులు పెట్టిన టిక్కెట్లు ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో సెలవు రోజుకు ముందు ఇళ్లకు చేరడం ఉద్యోగులు, వ్యాపారులకు కష్టతరంగా మారింది.
స్పేర్ బస్సులను నడుపుతున్నాం : డీపీటీవో షేక్ షబ్నం
కొత్త బస్సులు లేక సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. ఏలూరు బస్టాండ్‌లో ఐదు స్పేర్ బస్సులు ఉంటాయి. బాగా రద్దీగా ఉన్న వేళ్లల్లో విజయవాడకు వీటిని నడుపుతున్నాం. విజయవాడకు మరిన్ని సర్వీసులు పెంచే ఆలోచన వుంది. ప్రధానంగా శుక్ర,శనివారాల్లో, పెళ్లిళ్ల సీజన్‌లో రద్దీ నడుస్తోంది. దీన్ని పరిష్కారానికి సూపర్‌వైజర్ల ద్వారా నిరంతరం పర్యవేక్షణ చేసి అదనపు బస్సు సర్వీసులను నడుపుతున్నాం.