మద్యం మత్తులో కళాశాల బస్సును ఢీకొట్టిన లారీ డ్రైవర్
ABN , Publish Date - Feb 10 , 2026 | 12:03 AM
మద్యం మత్తులో లారీని అదుపు చేయలేక తమిళనాడుకు చెందిన డ్రైవర్ కళాశాల బస్సును ఢీ కొట్టాడు.కాలేజీ బస్సును అడ్డంగా వచ్చి లారీ ఢీ కొట్టడంతో ఆ బస్సులోని డ్రైవర్‌కు, నలుగురు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి.
మద్యం మత్తులో కళాశాల బస్సును ఢీకొట్టిన లారీ డ్రైవర్
నలుగురు విద్యార్థినులకు గాయాలు..
ఏలూరు క్రైం, ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతి): మద్యం మత్తులో లారీని అదుపు చేయలేక తమిళనాడుకు చెందిన డ్రైవర్ కళాశాల బస్సును ఢీ కొట్టాడు.కాలేజీ బస్సును అడ్డంగా వచ్చి లారీ ఢీ కొట్టడంతో ఆ బస్సులోని డ్రైవర్‌కు, నలుగురు విద్యార్థులకు స్వల్ప గాయాలయ్యాయి. ఏలూరు సమీ పంలోని దుగ్గిరాలలోని డీపాల్ ఇంటర్ డిగ్రీ కళాశాలకు చెందిన బస్సు సోమవారం సాయంత్రం కాలేజీ విడిచిపెట్టిన అనంతరం విద్యార్థులను ఏలూరులో దించి తిరిగి కొప్పాకవైపు నలుగురు విద్యార్థులతో వెళ్తుంది. దుగ్గిరాల బ్రిడ్జి దాటే సమయంలో ఆశ్రం వైపు నుంచి తమిళనాడుకు చెం దిన లారీ అతివేగంగా వచ్చి బస్సును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థినులు దెందులూరు మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన బి.నిర్మల(17), దుద్దే వసంత లక్ష్మి(17), కూచింపూడికి చెందిన డి.లక్ష్మిసత్యప్రియ(17), మసీదుపాడుకు చెందిన సువ్వా సువర్ణ శరణ్యలకు గాయాలయ్యాయి. వీరిలో నిర్మలకు బలమైన గాయాలవడంతో ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు అ క్కడి నుంచి విజయవాడ తరలించారు. సమాచారం అందుకున్న ఆర్సీఎం సంస్థల వికారీ జనరల్ పాదర్ బాల, డీపాల్ కాలేజీ ప్రిన్సిపాల్, ఏలూరు త్రి టౌన్ ఎస్‌ఐ రాంబాబు, సిబ్బంది, డీటీసీ షేక్ కరీముల్లా, ఆర్టీవో ఎస్.బి.శేఖర్, అసిస్టెంట్ మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్ స్వామి, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ట్రాఫిక్ స్థంభించడంతో క్రమబద్ధీకరిం చారు. వాహనాలను అక్కడి నుంచి తొలగించారు. లారీ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడని జాతీయ రహదారిపై వెళ్ళకుండా మద్యం మత్తులో దుగ్గిరాల బ్రిడ్జి వద్ద సర్వీసు రోడ్డులోకి వచ్చి లారీని అదుపు చేయలేక ఢీకొన్నాడని డీటీసీ చెప్పారు. ఈ సంఘటనపై ఏలూరు త్రి టౌన్ పోలీ సులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.