Share News

పంట బోదెలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

ABN , Publish Date - Jan 03 , 2026 | 12:13 AM

అదుపు తప్పిన ఆర్టీ సీ బస్సు పం ట బోదెలోకి దూసుకు వెళ్ళింది.

పంట బోదెలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు
ప్రత్తిపాడు వద్ద పంట బోదెలోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

పెంటపాడు, జనవరి 2 (ఆంధ్ర జ్యోతి): డ్రైవర్‌కు కళ్ళు తిరగడంతో అదుపు తప్పిన ఆర్టీ సీ బస్సు పం ట బోదెలోకి దూసుకు వెళ్ళింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తణుకు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ప్రయాణికు లతో తాడేపల్లిగూడెం మీదుగా ఏలూరు వెళ్తుంది. ప్రత్తిపాడు జాతీయ రహదారి జంక్షన్‌ వద్ద తాడేపల్లిగూడెం వైపుకు మలుపు తిరగగానే డ్రైవర్‌కు కళ్ళు తిరగడంతో బస్సు అదుపు తప్పి పంటబోదెలోకి దూసుకువెళ్ళింది. బస్సులో నలుగురు ప్రయాణికులు ఉండగా అందరూ క్షేమంగానే ఉన్నారు.

Updated Date - Jan 03 , 2026 | 12:13 AM