Share News

ఆక్వా యూనివర్సిటీకి మంచి రోజులు

ABN , Publish Date - Apr 02 , 2026 | 12:05 AM

ఆక్వా విశ్వవిద్యాలయానికి మంచి రోజులు రానున్నాయి. బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం రూ.35 కోట్లు కేటాయించింది.

ఆక్వా యూనివర్సిటీకి మంచి రోజులు
పునాదులతో నిలిచిపోయిన ఆక్వా విశ్వ విద్యాలయం

బడ్జెట్‌లో రూ.35 కోట్లు కేటాయింపు

బిల్లులు ఇవ్వలేదని నిర్మాణం నిలిపివేసిన కాంట్రాక్టర్‌

తాజా నిధులతో చిగురించిన ఆశలు

స్వర్ణాంధ్రలో తాత్కాలిక తరగతులు

సొంత క్యాంపస్‌ ఏర్పాటైతే దశ మారినట్టే

(భీమవరం–ఆంధ్రజ్యోతి)

ఆక్వా విశ్వవిద్యాలయానికి మంచి రోజులు రానున్నాయి. బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం రూ.35 కోట్లు కేటాయించింది. త్వర లోనే వాటిని విడుదల చేయనుంది.ఇక విశ్వవిద్యాలయ శాశ్వత క్యాంపస్‌ సిద్ధం కానుంది. బిల్లులు మంజూరు చేయడం లేదన్న ఉద్దేశంతో పునాదుల వద్దే కాంట్రాక్టర్‌ పనులు నిలిపివేశారు. ఇంజనీరింగ్‌ అధికారులు ఎంతగా సంప్రదిస్తున్నా సరే స్పందన లేదు. వచ్చే ఏడాది అమలయ్యే బడ్జెట్‌లో ప్రభుత్వం నిధులు కేటాయించడంతో ఆశలు చిగురించాయి. గత ప్రభుత్వంలో నరసాపురానికి ఆక్వా విశ్వవిద్యాలయం మంజూరు చేశారు. పేదల ఇళ్ల కోసం కొనుగోలు చేసిన స్థలాన్ని కేటాయించారు. వాస్తవానికి అక్కడ ఉన్న 54 ఎకరాల్లో వైద్య కళాశాల నిర్మించాల్సి వుంది. భూమి అనుకూలంగా లేదంటూ తేల్చడంతో పాలకొల్లు నియోజకవర్గానికి ప్రభుత్వ వైద్య కళాశాలను తరలించారు. ఇక నరసాపురంలో కొనుగోలు చేసిన స్థలాన్ని ఆక్వా విశ్వ విద్యాలయానికి కేటాయించారు. అప్పట్లో పనులు ప్రారంభిస్తున్నట్టు జగన్‌ మోహన్‌రెడ్డి ప్రక టించారు. పునా దుల వద్దే పనులు నిలిచిపోయాయి. తుఫాను భాధితుల సంరక్షణ కేంద్రంలోనే తరగతులు నిర్వహిస్తూ వచ్చారు. దాని వల్ల విద్యార్థులు ఇబ్బందులు చెప్పడానికి వీలు లేదు. నానా తంటాలు పడ్డారు. కనీసం హాస్టల్‌ వసతి కూడా లేదు. తరగతుల నిర్వహణకు సరైన వసతి లేదు. తాత్కాలిక క్యాంపస్‌ నిర్వహించడానికి స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్‌ కళాశాల ముందు కొచ్చినప్పటికీ వైసీపీ ప్రభుత్వం పెద్దగా స్పందించ లేదు. ఆక్వా విశ్వవిద్యాలయంలో చేరిన విద్యార్థులను గాలికొదిలేసింది.

తాత్కాలిక క్యాంపస్‌తో ఉపశమనం

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్వర్ణాంధ్ర కళాశాలలో తాత్కాలిక క్యాంపస్‌ నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతిచ్చింది. ప్రస్తుతం స్వర్ణాంధ్రలోనే ల్యాబ్‌లు, గ్రంథా లయం, హాస్టల్‌ వసతి సమకూరింది. ఉండిలో ఉన్న మత్స్య పరిశోధనా కేంద్రంలో ప్రయోగాలు చేస్తున్నారు. అక్కడకు వెళ్లి రావడానికి ప్రభుత్వం బస్సు సౌకర్యాన్ని సమకూర్చింది. అయితే శాశ్వత క్యాంపస్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలి. అప్పుడే ఆక్వా విశ్వవిద్యాలయ ఫలితాలు పూర్తిస్థాయిలో అందు బాటు లోకి వస్తాయి. ఆక్వా సాగుకు సమర్ధవం తమైన నిపుణులను అందించేందుకు అవకాశం ఉంటుంది. గత ప్రభుత్వ హయాంలో ఆక్వా విశ్వవిద్యాలయం పేరుతో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం వృద్ధి చేసుకున్నారు. తీర ప్రాంతంలో వైసీపీ నేతలు ఆక్వా చెరువులను అభివృద్ధి చేసుకున్నారు తప్ప విశ్వ విద్యాలయాన్ని పట్టించుకోలేదు. అప్పటి ప్రభుత్వ హామీలన్నీ కాగితాలకే పరిమితమయ్యాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాతే విశ్వవిద్యాలయంపై దృష్టి పెట్టారు. తాత్కాలికంగా విద్యార్థుల సమస్యలకు పరిష్కారం చూపారు.శాశ్వత క్యాంపస్‌ కోసం నిధులు కేటాయించారు. అసరమనుకుంటే మరిన్ని నిధులను పెంచాలి. విశ్వ విద్యాలయ క్యాంపస్‌ పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలి.

Updated Date - Apr 02 , 2026 | 12:05 AM