Share News

దళారుల్ని ఆశ్రయించొద్దు..

ABN , Publish Date - Sep 20 , 2026 | 12:50 AM

పోలవరం ఆర్‌అండ్‌ఆర్‌ భూ సేకరణలో అక్ర మాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవా లని సంబంధిత అధికారులకు చెప్పినట్టు ఎమ్మెల్యే చిర్రి బాలరాజు తెలిపారు.

 దళారుల్ని ఆశ్రయించొద్దు..

దళారుల్ని ఆశ్రయించొద్దు..

ఆర్‌అండ్‌ఆర్‌ భూసేకరణ విషయమై రైతులకు ఎమ్మెల్యే చిర్రి సూచన

భూ సేకరణ పారదర్శకంగా జరిగేందుకు కృషి చేస్తానంటూ స్పష్టం

జీలుగుమిల్లి,సెప్టెంబరు19(ఆంధ్రజ్యోతి): పోలవరం ఆర్‌అండ్‌ఆర్‌ భూ సేకరణలో అక్ర మాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవా లని సంబంధిత అధికారులకు చెప్పినట్టు ఎమ్మెల్యే చిర్రి బాలరాజు తెలిపారు. బర్రింకలపాడు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద శనివారం విలేక రుల సమావేశం నిర్వహించారు.చింతూరు మం డల గిరిజనులకు ఆర్‌అండ్‌ఆర్‌లో జీలుగుమిల్లి, బుట్టాయగూడెం మండలాల్లో భూసేకరణ జరి పారన్నారు. మర్లగూడెం భూములకు సంబం ధించి దళారులు రైతుల భూములు సేకరించే క్రమంలో పర్సంటేజ్‌లు వసూలు చేసినట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. జీలుగుమిల్లి మండలంలో గిరిజనులు సాగులో ఉన్న భూములకు గిరిజ నేతరులకు భూమిపై హక్కులు ఉండటంతో ఆయా భూములు ప్యాకేజీలో పెట్టారన్నారు. 1/70చట్టం పరిధిలో,గిరిజనులు సాగు చేస్తున్న భూములు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీలో కొనుగోలు చెయ్యవద్దని సంబంధిత అధికారులకు తెలిపా మని ఎమ్మెల్యే అన్నారు. రైతుల భూసేకరణలో పర్సంటేజ్‌ వసూలు చేసిన దళారులపైౖ చర్య లకు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశామన్నా రు.భూ సేకరణలో దళారులు తన పేరును విని యోగిస్తే సహించేది లేదన్నారు. పోలవరం ఆర్‌అండ్‌ఆర్‌ భూ సేకరణకు భవిష్య త్‌లో 1500 ఎకరాలు కావాల్సి ఉందన్నారు. ప్రస్తుతం ప్యాకే జీలో రైతుల నుంచి కొనుగోలు చేసి భూముల విలువ ప్రభుత్వం 10శాతం పెంచిందన్నారు. రికార్డులు సక్రమంగా ఉన్న రైతుల పోలవరం ప్యాకేజీ భూ సేకరణ పారదర్శకంగా జరిగేందుకు కృషి చేస్తున్నామ న్నారు. రైతుల దళారుల్ని ఆశ్రయించవద్దన్నా రు. ఆయా సమస్యలపై ఇక్కడ భూ సేకరణ తీరును సీఎం చంద్రబాబును కలిసి వివరించ నున్నట్టు ఎమ్మెల్యే చిర్రి బాలరాజు తెలిపారు.

Updated Date - Sep 20 , 2026 | 12:50 AM