సరిహద్దు చెక్‌పోస్ట్ వద్ద నిఘా ముమ్మరం : డీఎస్పీ
ABN , Publish Date - Mar 27 , 2026 | 12:25 AM
ఆంధ్రా–తెలంగాణ రాష్ట్ర సరిహద్దు తాటియాకులగూడెం వద్ద చెక్‌పోస్టు ఏర్పాటు చేసి తనిఖీలు ముమ్మరం చేస్తున్నట్టు పోలవరం డీఎస్పీ బి.వెంకటేశ్వరావు చెప్పారు.
జీలుగుమిల్లి, మార్చి26 (ఆంధ్ర జ్యోతి): ఆంధ్రా–తెలంగాణ రాష్ట్ర సరిహద్దు తాటియాకులగూడెం వద్ద చెక్‌పోస్టు ఏర్పాటు చేసి తనిఖీలు ముమ్మరం చేస్తున్నట్టు పోలవరం డీఎస్పీ బి.వెంకటేశ్వరావు చెప్పారు. గురువారం సీఐ వెంకటేశ్వరావు, ఎస్సైలు క్రాంతికుమార్, సిబ్బందితో కలసి వాహనాలను తనిఖీలు చేశారు. సరిహద్దు ప్రాంతం మీదుగా అక్రమం గా ఇసుక, గంజాయి, ఇతర రాష్ట్రాల మద్యం, అక్రమ బియ్యం, పశువుల తరలింపు, చికెన్ వ్యర్థాల తరలింపు వాహనాలు రాకుండా గట్టి నిఘా ఏర్పాటు చేశారు. 24 గంటల పాటు పోలీస్ తనిఖీలు ఉంటాయని అధికారులు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో చెక్‌పోస్టును ఎత్తివేయగా మరలా రెండేళ్ల అనంతరం ఇక్కడ చెక్‌పోస్టును ప్రారంభించడం గమనార్హం.