జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపు
ABN , Publish Date - Jan 09 , 2026 | 12:46 AM
కొద్ది క్షణాల్లోనే కోర్టు అంతా ఖాళీ చేశారు. న్యాయమూర్తులు కూడా తమ ఛాంబర్స్‌ను ఒదిలివేసి కోర్టు ఆవరణలో ఉన్న చెట్ల కిందకు చేరుకు న్నారు.
పోలీసు తనిఖీలు..
బాంబు లేదని నిర్ధారణ
కేసు నమోదు
ఏలూరు క్రైం, జనవరి 8(ఆంధ్రజ్యోతి):ఏలూరు నగర ంలో జిల్లా కోర్టు ఆవరణలో అన్ని కోర్టులలో గురువారం ఉదయం యఽథావిధిగా కోర్టు కార్యకలాపాల్లో న్యాయమూ ర్తులు, కోర్టు సిబ్బంది, న్యాయవాదులు, కక్షిదారులు ఉన్నారు. మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో పోలీ సులు హుటాహుటిన కోర్టు వద్దకు చేరుకున్నారు. లౌడ్ స్పీకర్ల ద్వారా వెంటనే కోర్టు నుంచి బయటకు వెళ్ళి పోవాలని త్రి టౌన్ సీఐ వి.కోటేశ్వరరావు హెచ్చరికలు జారీ చేశారు. ఎక్కడి వారు అక్కడే నిశ్శబ్దం అయిపో యారు. ఏమి జరిగింద ంటూ ఆలోచనలో పడ్డారు. ఇంకో వైపు కోర్టు హాలులో ఉన్న వారంతా అవాక్క య్యారు. లౌడ్ స్పీకర్ నుంచి హె చ్చరికలు వస్తూనే ఉన్నాయి. పైన ఉన్న వారు కూడా వెంటనే కిందకు వ చ్చేయాలని, కోర్టును ఖాళీ చేసి వెళ్ళి పోవాలని హెచ్చ రికలు జారీ చేశారు. యూనిఫామ్‌లో ఉన్న పోలీసులు కోర్టుల వద్దకు వెళ్ళి కక్షిదారులను, కోర్టు సిబ్బందిని, అక్కడ కనిపించిన వారందరినీ బయటకు వెళ్ళిపోవాలని సూచించారు. కొద్ది క్షణాల్లోనే కోర్టు అంతా ఖాళీ చేశారు. న్యాయమూర్తులు కూడా తమ ఛాంబర్స్‌ను ఒదిలివేసి కోర్టు ఆవరణలో ఉన్న చెట్ల కిందకు చేరుకు న్నారు. అయితే జిల్లా జడ్జి శ్రీదేవి మాత్రం తన ఛాంబ ర్‌లోనే ఉండి పరిస్థితిని సమీక్షించారు. ఇంకో వైపు రైయ్‌రైయ్ మంటూ పోలీసు వాహనాలు చేరుకున్నాయి. వాటి నుంచి రెండు పోలీసు జాగిలాలు, కొంతమంది బాంబు డిస్పోజల్ స్క్వాడ్ సిబ్బంది కూడా వచ్చారు. క్షణాల్లో వారు రంగంలోకి దిగారు. పోలీసు జాగిలాలతో విస్తృ తంగా కోర్టు ఆవరణలో ఉన్న చెత్త బుట్టల నుంచి కోర్టు వరండాలో ఉన్న న్యాయవాదుల టేబుల్స్‌ను, కోర్టు సిబ్బంది రూములను, ఇతర పరిసర ప్రాంతాలను న్యాయమూర్తుల ఛాంబర్స్‌ను విస్తృతంగా తనిఖీలు చేశారు. చివరకు సాయంత్రం 5 గంటల వరకు కోర్టు ఆవరణ అంతా తనిఖీలు జరిపి ఎక్కడా బాంబులు లేవ ని నిర్ధారణకు వచ్చారు.
మెయిల్ ఇలా వచ్చింది..
గురువారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఈలం పీపుల్స్ రివల్యూషనరీ లిబరేషన్ ఫ్రంట్ (ఈలం ప్రజాస్వామ్య విముక్తిసేన) సంస్థకు చెందిన అజ్మల్ అబ్దుల్లా అనే పేరు నుంచి జిల్లా ప్రధాన న్యాయమూర్తి (పీడీజే) మెయిల్‌కు ఒక మెయిల్ వచ్చింది. ఆ మెయిల్‌లో జిల్లా కోర్టులోని న్యాయమూర్తుల చాంబర్స్ మూడు ప్రదేశాల్లో ఆర్డీఎక్స్ (రీసెర్సిన్ డైనైట్రమైన్) అనే పేలుడు పదార్ధాన్ని ఎల్‌ఈడి (లైట్ ఇమెటింగ్ డయోట్)తో పేల్చివేస్తారని 1.35 గంటలకు ఈ ప్రక్రియ జరుగుతుందని బెదిరింపు మెయిల్ పంపించారు. కాశ్మీర్‌నకు చెందిన ఐఎస్‌కేపీ సభ్యులతో పాటు మాజీ ఎల్‌టీటీఈ (లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ ఈలం) సభ్యులు కలిసి ప్రణాళికతో బాంబులు పేల్చివేస్తారని ఆ మెయిల్‌లో పేర్కొన్నారు. దీంతో వెంటనే జిల్లా జడ్జి శ్రీదేవి జిల్లా ఎస్పీ కేపీఎస్ కిషోర్‌కు సమాచారం ఇచ్చా రు. ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ డి. శ్రావణ్‌కుమార్ పర్యవేక్షణలో త్రి టౌన్ సీఐ వి.కోటేశ్వరరావు, టూటౌన్ సీఐ కె.అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో బాంబు డిస్పోజల్ స్క్వాడ్‌లు, పోలీసు జాగితాలతో తనిఖీలు చేయించారు. బాంబు ఆనవాళ్ళు లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. డీఎస్పీ డి శ్రావణ్‌కుమార్ మాట్లాడుతూ బాంబు బెదిరింపు మెయిల్ ఇచ్చిన సంఘటనపై ఏలూరు త్రి టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశామని తెలిపారు. ప్రతి నెల ఆకస్మికంగా బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, షాపింగ్ మాల్స్‌లో బాంబు డిస్పోజల్ స్క్వాడ్‌లతో తనిఖీలు జరిపినట్లే కోర్టును కూడా తనిఖీలు చేయడానికి అనుమతి తీసుకుంటామన్నారు.