ఘనంగా ‘బొలిశెట్టి’ జన్మదిన వేడుకలు
ABN , Publish Date - Aug 17 , 2026 | 12:19 AM
తాడేపల్లిగూడెం మండలం చినతాడేపల్లిలో టీడీపీ మండల అధ్యక్షుడు పరిమి రవికుమార్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ జన్మదిన వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహిం చారు.
తాడేపల్లిగూడెం రూరల్, ఆగస్టు 16(ఆంధ్రజ్యోతి): తాడేపల్లిగూడెం మండలం చినతాడేపల్లిలో టీడీపీ మండల అధ్యక్షుడు పరిమి రవికుమార్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ జన్మదిన వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహిం చారు. తొలుత కేక్ కట్ చేసి వృద్ధులు, మహిళలకు టీడీపీ నాయకులు అందించి, అనంతరం మహిళలకు చీరల పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి చిటకన శ్రీనివాస్, మాజీ సర్పంచ్ అత్తంటి తాతయ్య, నాయకులు పరిమి వెంకటేశ్వరరావు, గన్నమని అనిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. భగత్‌సింగ్ కాలనీలో జనసేన నాయకులు పైబోయిన వెంకట రామయ్య ఆధ్వర్యంలో బొలి శెట్టి జన్మదిన వేడుకలు నిర్వహించారు. 300 మంది పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. సొసైటీ అధ్యక్షుడు సిద్దా వీర్రాజు, జనసేన నాయకులు చాపల రమేష్, కర్రి సురేష్, షేక్ పటాన్‌వల్లి, వడ్డెర సంఘ నాయకులు పాల్గొన్నారు.