మోదీ విజయాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలి
ABN , Publish Date - Jun 03 , 2026 | 12:37 AM
ప్రధాని మోదీ 12 ఏళ్ల పాలనలో దేశం సాధించిన ప్రగతి, విజయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పార్టీ కార్యకర్తలకు కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ సూచించారు.
భీమవరం, జూన్ 2(ఆంధ్రజ్యోతి):ప్రధాని మోదీ 12 ఏళ్ల పాలనలో దేశం సాధించిన ప్రగతి, విజయాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పార్టీ కార్యకర్తలకు కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ సూచించారు. ఈ నెల 5 నుంచి 21వ తేదీ వరకు ప్రజల్లోకి వెళ్లి ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. మంగళవారం జరిగిన పార్టీ నాయకుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఎన్డీయే పాలన లోనే దేశంలో ఎక్స్‌ప్రెస్ హైవేలు, గ్రీన్ కారిడర్‌లు, రైల్వే అభివృద్ధి ప్రాజెక్ట్‌లు గణనీయంగా అభివృద్ధి సాధించాయని తెలిపారు. ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా ప్రజలను భాగస్వాములను చేయాలని దిశా నిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మట్టా ప్రసాద్ మాట్లాడుతూ జూన్ 5న పర్యావరణ దినోత్సవం సందర్భంగా అమ్మ పేరుతో ఒక మొక్కను నాటాలని కోరారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మీ ప్రసన్న, రాష్ట్ర కార్యదర్శి భోగిరెడ్డి ఆదిలక్ష్మి, జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, నాయకులు నార్ని తాతాజీ, కలిదిండి వినోద్ వర్మ, తోట గంగరాజు పాల్గొన్నారు.