Share News

వచ్చే ఏడాదికి పోలవరం

ABN , Publish Date - Jul 17 , 2026 | 12:41 AM

పోల వరం ప్రాజెక్టును 2027 మార్చి నాటికి పూర్తిచేసి రాష్ట్ర ప్రజలు, రైతుల దశాబ్దాల కలను నిజం చేస్తామని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై.సత్యకుమార్‌ యాదవ్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌, రాజ మండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి స్పష్టం చేశారు.

వచ్చే ఏడాదికి పోలవరం
ప్రాజెక్టును పరిశీలిస్తున్న కేంద్ర మంత్రి వర్మ, రాష్ట్ర మంత్రి సత్యకుమార్‌

ప్రాజెక్టును సందర్శించిన బీజేపీ నేతలు.. పనుల తీరుపై సంతృప్తి

పోలవరం, జూలై 16(ఆంధ్రజ్యోతి):పోల వరం ప్రాజెక్టును 2027 మార్చి నాటికి పూర్తిచేసి రాష్ట్ర ప్రజలు, రైతుల దశాబ్దాల కలను నిజం చేస్తామని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై.సత్యకుమార్‌ యాదవ్‌, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్‌ మాధవ్‌, రాజ మండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి స్పష్టం చేశారు. ‘పోలవరం–మోదీ వరం’ ప్రాజెక్టు సంద ర్శనలో భాగంగా కేంద్ర, రాష్ట్ర బీజేపీ నేతలు గురువారం పోలవరం వచ్చారు. ప్రాజెక్టు పనుల ను పరిశీలించి పనుల తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. తొలుత ప్రాజెక్టు హిల్‌వ్యూ పాయింట్‌ నుంచి ప్రాజెక్టు స్పిల్‌వే, స్పిల్‌ ఛానల్‌ ప్రాంతాన్ని పరిశీలించారు. వారికి ఎస్‌ఈ రామచంద్రరావు సంబంధిత వివరాలను తెలిపారు. అనంతరం పవర్‌ హౌస్‌, ఈసీఆర్‌ఎఫ్‌ గ్యాప్‌ 1, 2 ప్రాం తాల్లో జరుగుతున్న పనులను పరిశీలించారు. ఆయా ప్రాంతాల్లో పనుల పురోగతిపై జలవనరు ల శాఖ అధికారులు ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జి బిషన్లను పరిశీలించి ఇంజనీరింగ్‌ అఽధికారులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించి పనులు వేగవంతం చేయాలని సూచించారు. పరిశీలనలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యే లు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, పీవీ పార్థసారఽథి, ఎన్‌.ఈశ్వరరావు, వి.విష్ణుకుమార్‌రాజు, ఇరవై సూత్రాల కార్యక్రమం అమలు చైర్మన్‌ లంకా దినకర్‌, ఏపీ ఎస్టీ కమీషన్‌ చైర్మన్‌ చోళ్ళ బొజ్జి రెడ్డి, తెలుగు అకాడమి చైర్మన్‌ రాయపాటి డేవి డ్‌ విల్సన్‌, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బొల్లిన నిర్మలా కిశోర్‌, గారపాటి సీతారామాంజనేయ చౌదరి, జిల్లా అధ్యక్షుడు విక్రమ్‌కిశోర్‌లతోపాటు జేసీ అభిషేక్‌గౌడ, అడ్మినిస్ట్రేటర్‌ ఎక్స్‌ అఫీషియో జేసీ వి.అభిషేక్‌, రంపచోడవరం ఐటీడీఏ పీవో ప్రశాంత్‌కుమార్‌, ఇంజనీరింగ్‌ చీఫ్‌ కె.నరసింహ మూర్తి, మేఘా ఇంజనీరింగ్‌ జీఎం గంగాధర్‌, ఏజీఎం మురళి పాల్గొన్నారు.

Updated Date - Jul 17 , 2026 | 12:41 AM