నూజివీడులో బయోమస్ పవర్‌ప్లాంట్
ABN , Publish Date - Apr 10 , 2026 | 11:37 PM
నూజివీడు నియో జకవర్గంలోని ఆగిరిపల్లిలో బయోమస్ పవర్‌ప్లాంట్ ఏర్పా టుకు మార్గం సుగమం అయ్యింది.
రాష్ట్ర కేబినెట్‌లో గ్రీన్‌సిగ్నల్
ఏలూరు, ఏప్రిల్ 10(ఆంఽధ్రజ్యోతి): నూజివీడు నియో జకవర్గంలోని ఆగిరిపల్లిలో బయోమస్ పవర్‌ప్లాంట్ ఏర్పా టుకు మార్గం సుగమం అయ్యింది. రాష్ట్రవ్యాప్తంగా మెసర్స్ ఎస్‌ఏఈఎల్ ఇండస్ర్టీస్ లిమిటెడ్ అభ్యర్థన మేరకు ఎనిమిది జిల్లాలో ఈ తరహా ప్లాంట్లు ఏర్పాటు చేయడానికి రాష్ట్ర కేబినెట్‌లో గురువారం ఆమోద ముద్ర వేశారు. ఇందులో ఏలూరు జిల్లాలోని ఆగిరిపల్లి ఉంది. ఇక్కడ 500 ఎకరాల్లో బయోమాస్ ప్లాంట్ 25 మెగావాట్ల సామర్థ్యం కలిగిన యూనిట్‌ను స్థాపించనున్నారు. త్వర లో భూసేకరణ, ఇతర అంశాలపై రెవెన్యూ, మైనింగ్, వి ద్యుత్ శాఖలు సమన్వయంతో ముందుకు సాగనున్నాయి.