Share News

దారి తప్పిన పార్కింగ్‌

ABN , Publish Date - Feb 27 , 2026 | 12:30 AM

జిల్లా అంతటికి రోల్‌ మోడల్‌గా ఉండాల్సిన కలెక్టరేట్‌లో వాహనాల పార్కింగ్‌ వ్యవస్థ గాడి తప్పింది. అధికారులు విధులు నిర్వహించే చోట ఎవరికి వారు ఇష్టారాజ్యంగా తమ బైక్‌లను పార్కింగ్‌ చేయడంతో ఇబ్బందులు ఎదురవుతు న్నాయి.

దారి తప్పిన పార్కింగ్‌
కలెక్టరేట్‌లో ఇష్టారాజ్యంగా వాహనాలు నిలుపుదల

ఏలూరు కలెక్టరేట్‌లో ఇష్టారాజ్యంగా వాహనాలు నిలుపుదల

(ఏలూరు–ఆంధ్రజ్యోతి)

జిల్లా అంతటికి రోల్‌ మోడల్‌గా ఉండాల్సిన కలెక్టరేట్‌లో వాహనాల పార్కింగ్‌ వ్యవస్థ గాడి తప్పింది. అధికారులు విధులు నిర్వహించే చోట ఎవరికి వారు ఇష్టారాజ్యంగా తమ బైక్‌లను పార్కింగ్‌ చేయడంతో ఇబ్బందులు ఎదురవుతు న్నాయి. కలెక్టర్‌, జేసీ, డీఆర్వో, ఆర్డీవోల వాహనాలకు పార్కింగ్‌ సౌకర్యం ఉంది. ఉద్యోగులు, సిబ్బంది వాహనాలను నిలిపేందుకు పార్కింగ్‌ ప్రాంతాలు ఆయా కార్యాలయాల వద్ద లేకపోవడంతో కలెక్టరేట్‌లోకి ప్రవేశించే మార్గాల వద్ద.. వివిధ సెక్షన్ల వద్ద నిలుపుతున్నారు. వివిధ విభాగాలకు వెళ్లే ప్రజలకు ఇది ఇబ్బందికరంగా మారింది. డీఆర్‌డీఏ, డ్వామా, ఐసీడీఎస్‌, విజిలెన్స్‌, ఎస్సీ కార్పొరేషన్‌, బీసీ కార్పొరేషన్‌, ఆర్డీవో కార్యాలయాల పరిసరాల్లో వాహనాలతో దారులు మూసుకుపోయాయి. మంత్రులు వచ్చిన, ఇతర కీలక సమావేశాలు జరిగే రోజు కలెక్టరేట్‌ ప్రాంగణం నుంచి వాహనాలతో బయటకు రావడం కష్టసాధ్యంగా మారుతోంది. ప్రతి ప్రభుత్వ కార్యాలయం వద్ద పార్కింగ్‌ ఏర్పాట్లపై కలెక్టర్‌ ప్రత్యేక దృష్టి పెట్టాలి.

Updated Date - Feb 27 , 2026 | 12:30 AM