సంజీవనితో మెరుగైన వైద్యం
ABN , Publish Date - Mar 10 , 2026 | 12:44 AM
రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యం అందించాలని లక్ష్యంతో సంజీవని పథకాన్ని కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారఽథి అన్నారు.
నూజివీడు ఏరియా ఆసుపత్రిలో బ్లడ్ బ్యాంక్ ప్రారంభం
నూజివీడు, మార్చి 9(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యం అందించాలని లక్ష్యంతో సంజీవని పథకాన్ని కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిందని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారఽథి అన్నారు. నూజివీడు ఏరియా ఆసుపత్రిలో నూతనంగా మంజూరైన బ్లడ్ బ్యాంక్, లాప్రోస్కోపీ యంత్ర పరికరాలను సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘గత ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకాన్ని గాలికి వదిలివేయగా కూటమి ప్రభుత్వం ఎన్టీఆర్ వైద్యసేవ ద్వారా మెరుగైన వైద్య సేవలను అందిస్తోంది. నూజివీడు నియోజకవర్గంలోనే రూ.11 కోట్లు సీఎం సహాయనిధి చెక్కులను అందించాం. నూజివీడు ఏరియా ఆసుపత్రి అభివృద్ధికి రూ.నాలుగు కోట్లు ఖర్చు చేశాం. నూజివీడు వాసుల కలగా ఉన్న బ్లడ్ బ్యాంక్‌ను సాకారం చేయడం ఆనందంగా ఉంది. రూ.10 కోట్లతో నవజాత శిశు సంరక్షణ కేంద్రంను మంజూరు చేశా’మ న్నారు. ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ పద్మజా రాణి, ఆర్‌ఎంవో శ్రీనివాసరావు, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు దుర్గాదేవి, ముత్యాల కామేష్, ఇళయరాజా పాల్గొన్నారు.