Share News

రాష్ట్ర స్థాయిలో జిల్లాకు బెస్ట్‌ రికవరీ అవార్డు

ABN , Publish Date - May 09 , 2026 | 12:33 AM

రాష్ట్ర స్థాయిలో బెస్ట్‌ రికవరీ అవార్డును ఎస్పీ కేపీ ఎస్‌ కిశోర్‌ శుక్రవారం ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో డీజీపీ హెచ్‌కే గుప్తా చేతుల మీదుగా అందుకున్నారు.

రాష్ట్ర స్థాయిలో జిల్లాకు బెస్ట్‌ రికవరీ అవార్డు
డీజీపీ హెచ్‌కె గుప్తా నుంచి రాష్ట్రస్థాయిలో బెస్ట్‌ రికవరీ అవార్డును అందుకుంటున్న ఎస్పీ కిశోర్‌

డీజీపీ నుంచి అవార్డు అందుకున్న ఎస్పీ కేపీఎస్‌ కిశోర్‌

ఏలూరు క్రైం, మే 8 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర స్థాయిలో బెస్ట్‌ రికవరీ అవార్డును ఎస్పీ కేపీ ఎస్‌ కిశోర్‌ శుక్రవారం ఆంధ్రప్రదేశ్‌ పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో డీజీపీ హెచ్‌కే గుప్తా చేతుల మీదుగా అందుకున్నారు. రాష్ట్రస్థాయి లో 2,746 సెల్‌ఫోన్లను (వీటి విలువ 4 కోట్ల 11 లక్షల 90 వేల రూపాయలు) రికవరీ చేసి బాధితులకు త్వరితగతిన అందించారు. రాష్ట్రంలోనే అత్యధికంగా సెల్‌ఫోన్లు రికవరీ చేసిన జిల్లాగా గుర్తింపు రావడంతో బెస్ట్‌ రికవరీ అవార్డును ఎస్పీకి అందించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సెంట్రల్‌ ఎక్యూప్‌మెంట్‌ ఐడెంటీ రిజిస్టర్‌ (సీఇఐఆర్‌) పోర్టర్‌ను ఏలూరు జిల్లా పోలీసులు అత్యంత సమర్థవంతంగా వినియోగించి పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన మొబైల్స్‌ను బ్లాక్‌ చేయడంతో పాటు వాటి ఆచూకీ కని పెట్టడంలో సాంకేతికతను జోడించి వేగంగా స్పందిస్తున్నారు. ఈ సంద ర్భంగా డీజీపీ మాట్లాడుతూ ఏలూరు జిల్లా పోలీసులు చూపుతున్న చొరవ మిగిలిన జిల్లాలకు ఆదర్శమని కొనియాడారు. ప్రజల ఫిర్యాదులపై తక్షణమే స్పందించి వారి మొబైల్‌ ఫోన్లను వారి ఇంటి వద్దకే పోలీసులు వెళ్లి అప్పగించడంపై ప్రజల్లో పోలీస్‌శాఖపై నమ్మకం పెరుగుతుందన్నారు. ఈ అవార్డు జిల్లాలోని ప్రతి పోలీస్‌ అధికారి, సిబ్బంది చేసిన కష్టానికి ఫలితమని ఎస్పీ తెలిపారు. కాగా బెస్ట్‌రికవరీ అవార్డు అందుకున్న ఎస్పీని పలువురు అభినందించారు.

Updated Date - May 09 , 2026 | 12:33 AM