Share News

స్థానిక బీసీ రిజర్వేషన్లపై అధ్యయం

ABN , Publish Date - Jun 12 , 2026 | 12:57 AM

:స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు తగు రిజర్వేషన్ల ఖరారుపై అధ్యయ నం చేసేందుకు ప్రభుత్వం నియమించిన డెడి కేషన్‌ కమిషన్‌ గురువారం ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పర్యటించింది.

స్థానిక బీసీ రిజర్వేషన్లపై అధ్యయం
తాడేపల్లిగూడెంలో మిశ్రాకు సమస్యలు వివరిస్తున్న దేవ తిలకుల సంఘ సభ్యులు

కమిషన్‌ చైర్మన్‌ రంజన్‌ మిశ్రా

ఏలూరు రూరల్‌/తాడేపల్లిగూడెం, జూన్‌ 11(ఆంధ్రజ్యోతి):స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు తగు రిజర్వేషన్ల ఖరారుపై అధ్యయ నం చేసేందుకు ప్రభుత్వం నియమించిన డెడి కేషన్‌ కమిషన్‌ గురువారం ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పర్యటించింది. ఏలూరు కలెక్టరేట్‌, తాడేపల్లిగూడెం మున్సిపల్‌ కార్యాల యాల్లో బహిరంగ విచారణ చేపట్టింది. ఏలూ రులో కమిషన్‌ ఛైర్మన్‌ రాజీవ్‌రంజన్‌ మిశ్రా అధ్యక్షతన, కలెక్టర్‌ కె.వెట్రిసెల్వితో కలిసి జిల్లా అధికారుల నుంచి కీలక సమాచారాన్ని సేక రించారు. బీసీల్లోని ఏబీసీడీ వర్గాల అధ్యయ నం, కులగణనలతో బీసీలకు న్యాయం జరుగు తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఇప్పటికి 12 జిల్లాల్లో పర్యటించి బీసీ ఉపకులాల నుంచి వినతిపత్రాలను స్వీక రించామన్నారు. వీటిని పరిశీలించి ప్రభుత్వా నికి నివేదిక అందజేస్తామని కమిషన్‌ ఛైర్మన్‌ తెలిపారు.

వినతులలో కొన్ని..

రాష్ట్ర వడ్డీ కార్పొరేషన్‌ ఛైర్‌పర్సన్‌ ఘంట సాల వెంకటలక్ష్మి, వడ్డీ కులాన్ని మత్స్యకార జాబితాలో చేర్చి, జనాభా దామాషా ప్రకారం స్థానిక సంస్థల్లో రాజకీయ ప్రాతి నిధ్యం కల్పించాలని కోరారు.

ఏపీ బీసీ కులాల జేఏసీ ప్రతినిధులు బీసీలకు జనాభా ధామాషా ప్రకారం అన్ని రంగాలలో 50 శాతం రిజర్వేషన్లు కల్పిం చాలని వినతిపత్రం సమర్పించారు.

ఏలూరు నగర గౌడ సంక్షేమ సంఘం ప్రతినిధులు గౌడ కులానికి స్ధానిక సంస్థల్లో ప్రత్యేక సబ్‌ కోటా కల్పించాలని వినతిపత్రం సమర్పించారు.

జడ్పీ ఛైర్‌పర్సన్‌ ఘంటా పద్మశ్రీ బీసీలకు జనాభా నిష్పత్తి మేరకు రాజకీయ ప్రాతి నిధ్యం కల్పించాలని కమిషన్‌ను కోరారు.

గాండ్ల, తెలికుల, దేవతిలకుల ఉపవర్గాలకు చెందిన తాము పది లక్షలకు పైగా ఉన్న ప్పటికి ప్రభుత్వ గణాంకాలలో 1.70 లక్షలు గా ప్రకటించడంతో తమకు రావాల్సిన వాటాను కోల్పోతున్నట్లు దేవ తిలకుల రాష్ట్ర సమాఖ్య అధ్యక్షుడు అడ్డా వీర వెంకటరాజు, కార్యదర్శి కాశిన సత్యనారా యణ లేఖలో వివరించారు.

బీజేపీ నాయకులు పాకా సత్య నారాయణ, బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వర్తనపల్లి కాశీ (నాయీబ్రాహ్మణ), తెలుగుదేశంపార్టీ రాష్ట్ర కార్యదర్శి గొర్రెల శ్రీధర్‌ (కొప్పువెలమ), జొన్నాడ శ్రీనివాస్‌ (రజక), అడ్డాల నరిసింహారావు (రజక) తదితరులు వినతి పత్రాలను మిశ్రాకు అందించారు.

Updated Date - Jun 12 , 2026 | 12:57 AM