అరటి ధరలు ఆకాశాన్నంటాయి
ABN , Publish Date - Feb 18 , 2026 | 12:27 AM
చక్రకేళి ధరలు ఒక్కసారిగా పెరిగాయి. గెల ధర ఏకంగా రూ.1000 ఎగబాకింది.
తగ్గిన సాగు విస్తీర్ణం.. కర్పూర చక్రకేళి గెల రూ.1,000
చక్రకేళి ధరలు ఒక్కసారిగా పెరిగాయి. గెల ధర ఏకంగా రూ.1000 ఎగబాకింది. మూడేళ్లుగా ప్రకృతి వైపరీత్యాలు వంటి కారణాలతో అరటి రైతులు నష్టపోయారు. దీనితో సాగు విస్తీర్ణం తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో నేడు ఒక్కసారిగా ధరలు పెరిగాయి. మార్కెట్‌లోకి అరటి గెలలు తక్కువగా వస్తున్నాయి. మామిడి కాయలు మార్కెట్‌లోకి వచ్చేవరకు అరటి ధరలు తగ్గే పరిస్థితి లేదని వ్యాపారులు అంటున్నారు.
తాడేపల్లిగూడెం, ఫిబ్రవరి 17(ఆంధ్రజ్యోతి):అరటి ధరలు ఆకాశాన్నంటాయి. ముహూర్తాలు దగ్గర పడు తున్న సమయంలో వీటి ధరలు పెరగడంతో విని యోగదారులు ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో అరటి సాగును ఎక్కువగా సాగుచేస్తారు. తూర్పుగోదావరి జిల్లాల్లో అంబాజీపేట, రావులపాలెం, ఉగ్గుమూడి ప్రాంతాల్లో అధికంగా సాగుచేస్తారు. ఉమ్మడిపశ్చిమగోదారి జిల్లాలో పెరవలి, ఖండవల్లి, అన్నారప్పాడు, లంకప్రాంతాల్లో వీటి సాగు ఎక్కువగా ఉంది. ఈ ప్రాంతాల్లో కర్పూరచక్రకేళి, తె ల్లచక్రకేళి, ఎర్రచక్రకేళి, గ్రాండ్‌నైన్ వంటివి ప్రసిద్ధి. మూడు ఏళ్లుగా అంతంత మాత్రంగా ఉన్న అరటి ధరలు ప్రస్తుతం ఆకాశాన్నంటాయి. నష్టాల బాట పట్టిన అరటి రైతులు సాగువిస్తీర్ణం ప్రస్తుతం తగ్గిం చారు. ప్రకృతి వైపరీత్యాలు తోడు కావడంతో ప్రత్యా మ్నాయ పంటలైన కంద, పసుపు, కూరగాయలు, కోకో వైపు ఎక్కువగా మళ్లారు. గతంలో ఉమ్మండి పశ్చిమ గోదావరి జిల్లాలో 13వేల ఎకరాల్లో సాగుచేయగా ఇప్పు డు 6వేల ఎకరాలకు పరిమితమైంది. దీంతో డిమా ండ్‌కు తగ్గట్టుగా అరటి మార్కెట్‌కు రావడం లేదు. దీంతో ఒక్కసారిగా అరటి ధరలు పెరిగాయి. గత నెలవరకు గెల రూ.200 నుంచి 300 మధ్య కర్పూర చక్రకేళి, తెల్లచక్రకేళి, ఎర్రచక్రకేళి ధరపలికేది. ఇప్పుడు ఏకంగా గెల రూ.700 నుంచి 1000 పెరిగింది. ఏప్రిల్ నెలవరకు ధరలు ఇలాగే ఉంటాయని వ్యాపారులు చెబుతున్నారు.
మార్కెట్‌కు తక్కువగా వస్తున్న అరటి
మార్చి, ఏప్రిల్ మాసంలో మామిడి పండ్లు మార్కెట్‌లోకి రావడంతో వీటి ధరలు తగ్గుతాయని చెబుతున్నారు. ధరలు పెరిగిన దానికి తగ్గటుగా సరకు లభించడం లేదని వ్యాపారులు పేర్కొంటున్నారు. జిల్లా లోని వ్యాపారులు అంతా రావులపాలెం అరటి మార్కె ట్‌పై ఆధారపడి ఉంటారు. అయితే అక్కడ కూడా మార్కెట్‌కు అరటి గెలలు రావడం లేదని చెబుతు న్నారు. రావులపాలెం మార్కెట్‌కు రోజుకు గతంలో 30వేల అరటి గెలలు ఎగుమతి జరిగేవని చెబుతు న్నారు. ప్రస్తుతం 12వేల నుంచి 14వేల మధ్య మాత్రమే వస్తున్నాయి. దీంతో అరిటికి మంచి డిమా ండ్ వచ్చింది. తాడేపల్లిగూడెం మార్కెట్లో కూడా అరటి గెలలు రావడం తగ్గింది. దీంతో అధిక పాట పెట్టి వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. మధ్యరకం గెలలు కూడా ఇక్కడ రూ.800 నుంచి 1000కు కొనుగోలు చేస్తున్నారంటే అరటికి ఉన్న డిమాండ్ తెలుస్తోంది.