శాకంబరిగా బలుసులమ్మ
ABN , Publish Date - Jul 18 , 2026 | 12:11 AM
తాడేపల్లిగూడెం పురదేవత బలుసులమ్మ శాకంబరిగా భక్తులకు శుక్రవారం దర్శనమి చ్చారు. పలు రకాలైన 15 టన్నుల కూరగా యలతో అమ్మవారిని, ఆలయ ప్రాంగణాన్ని, ఉత్సవ విగ్రహాన్ని అలకరించారు.
తాడేపల్లిగూడెం పురదేవత బలుసులమ్మ శాకంబరిగా భక్తులకు శుక్రవారం దర్శనమి చ్చారు. పలు రకాలైన 15 టన్నుల కూరగా యలతో అమ్మవారిని, ఆలయ ప్రాంగణాన్ని, ఉత్సవ విగ్రహాన్ని అలకరించారు. జాతర ఉత్సవాలను తలపించేవిధంగా భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు క్యూకట్టారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు భోజనాల ఏర్పాట్లు చేశారు. అమ్మవారిని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ దర్శించు కున్నారు. ఆలయ మర్యాదలతో ఎమ్మెల్యేకు వేదపండితులు స్వాగతం పలికి, ఆశీర్వచనాలు అందించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులు ఉండడం వల్లే నియోజకవర్గం పురోభివృద్ధిలో ఉందన్నారు. బీజేపీ నియోజక వర్గ ఇన్‌చార్జి ఈతకోట భీమశంకరరావు, ఆలయ కమిటీ నిర్వాహకులు శ్రీరంగం అంజి, నీలం సురేష్, దాట్ల జగన్నాధరాజు, ఆలయ ఈవో చంద్రశేఖర్, కూటమి నాయకులు పాల్గొన్నారు. – తాడేపల్లిగూడెం