Share News

బలుసులమ్మ ఆలయానికి పోటెత్తిన మహిళలు

ABN , Publish Date - Mar 19 , 2026 | 12:52 AM

తాడేపల్లిగూడెం బలుసులమ్మ ఆలయంలో బుధవారం పసుపు కొమ్ములను తీసుకునేందుకు అధిక సంఖ్యలో మహిళలు క్యూకట్టారు. ఈనెల 13వ తేదీన బలుసులమ్మ ఆలయం వద్ద అమ్మవారికి పసుపు కొమ్ములతో ప్రత్యేక పూజలు చేశారు.

బలుసులమ్మ ఆలయానికి పోటెత్తిన మహిళలు
పసుపుకొమ్ముల కోసం వచ్చిన మహిళా భక్తులు..

పసుపు కొమ్ములు అందుకునేందుకు తరలివచ్చిన భక్తులు

తాడేపల్లిగూడెం,మార్చి18(ఆంధ్రజ్యోతి):తాడేపల్లిగూడెం బలుసులమ్మ ఆలయంలో బుధవారం పసుపు కొమ్ములను తీసుకునేందుకు అధిక సంఖ్యలో మహిళలు క్యూకట్టారు. ఈనెల 13వ తేదీన బలుసులమ్మ ఆలయం వద్ద అమ్మవారికి పసుపు కొమ్ములతో ప్రత్యేక పూజలు చేశారు. వాటిని మహిళలకు ఆలయం వద్ద ఉన్న యాగశాల సమీపంలో బుధవారం అందజేశారు. వీటిని తీసుకునేందు పట్టణంలో మహిళలు తరలివచారు. భక్తుల రద్దీని తట్టుకునేందుకు బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఒక దశలో మహిళలను అదుపుచేయలేని పరిస్థితి నెలకొనడంతో బారికేడ్ల లోపల నుంచే పసుపుకొమ్ములను మహిళలకు అందజేశారు. ఉదయం యాగశాల వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ధూపసేవ, బలిహరణలో భాగంగా మధ్యాహ్నం పెసలు కలిపిన అన్నం నివేదన చేశారు. దీనివల్ల పంచ భూతాల శాంతి, భూకంపాది భయనివృత్తి జరుగుతుందని ప్రగాఢ విశ్వాసం. అమ్మవారిని స్థానిక ఎమ్మెల్యే తనయుడు బొలిశెట్టి రాజేష్‌, కూటమి నాయకులు దర్శించు కున్నారు. ఆలయ అర్చకులు సమక్షంలో ప్రత్యేక పూజలు చేసి వేద ఆశీర్వచనాలు అందించారు.

Updated Date - Mar 19 , 2026 | 12:52 AM