విద్యార్థుల భద్రతపై దృష్టి పెట్టాలి
ABN , Publish Date - Oct 07 , 2026 | 12:04 AM
విద్యార్థుల సురక్షిత ప్రయా ణాన్ని దృష్టిలో ఉంచుకుని విద్యా సంస్థల యాజమాన్యాలు బస్సుల నిర్వహణలో నిబంధనలను పాటించాలని ఉపరవాణా కమిషనర్ షేక్ కరీమ్ అన్నారు.
ఉప రవాణా కమిషనర్ షేక్ కరీమ్
ఏలూరు క్రైం, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): విద్యార్థుల సురక్షిత ప్రయా ణాన్ని దృష్టిలో ఉంచుకుని విద్యా సంస్థల యాజమాన్యాలు బస్సుల నిర్వహణలో నిబంధనలను పాటించాలని ఉపరవాణా కమిషనర్ షేక్ కరీమ్ అన్నారు. విద్యా సంస్ధల బస్సు డ్రైవర్లకు రహదారి భద్రతపై మంగళవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. చిన్నారులకు ప్రమాదం జరిగితే వారి తల్లిదండ్రుల బాధను ఎవరూ తీర్చలేరని, విద్యా ర్థుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. వాహనాల ఫిట్‌నెస్ ను నిర్ణీత వ్యవధిలో తనిఖీ చేయించుకోవాలని, బస్సులకు అవసరమైన పర్మిట్, ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికెట్ తదితర పత్రాలు చెల్లుబాటు లో ఉండేలా యాజమాన్యాలు చూసుకోవాలన్నారు. డ్రైవర్లకు చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్సు, అవసరమైన అర్హతలు ఉండేలా యాజమా న్యాలు నిర్ధారించుకోవాలన్నారు. డ్రైవర్లకు ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలన్నారు. డ్రైవర్లు మత్తు పదార్ధాల ప్రభావంలో వాహనం నడపకూడదని, వాహనం నడుపుతున్న సమయంలో మొబైల్ ఫోన్ వినియోగించరాదన్నారు. విద్యా సంస్ధల బస్సుల్లో విఎల్‌టిడి (వెహికల్ లొకేషన్ ట్రాకింగ్ డివైజ్), డ్యాష్‌బోర్డు కెమెరాలు ఏర్పాటు చేసుకోవాల న్నారు. బస్సుల్లో ఫస్ట్ ఎయిడ్ బాక్స్, అగ్నిమాపక పరికరాలు, అత్యవసర ద్వారం వంటి భద్రతా సదుపాయాలు అందుబాటులో ఉండేలా చూడాల న్నారు. బస్సుల్లో నిర్ణీత సామర్ధ్యానికి మించి విద్యార్థులను ఎక్కించరాదని తెలిపారు. బస్సు కదులుతున్న సమయంలో విద్యార్థులు తలుపుల వద్ద నిలబడకుండా, కిటీకీల నుంచి బయటకు తలలు లేదా చేతులు పెట్టకుండా డ్రైవర్లు, సిబ్బంది పర్యవేక్షించాలన్నారు. కార్యక్రమంలో ఆర్టీవో ఎస్‌బి శేఖర్, వాహన తనిఖీ అధికారులు ఎన్‌డి విఠల్, రమేష్‌బాబు, గేదెల ప్రసాదరావు, నెహ్రూ, సుమారు 150 మంది విద్యా సంస్థల బస్సు డ్రైవర్లు పాల్గొన్నారు.