Share News

సతీష్‌ చందర్‌కు కళారత్న

ABN , Publish Date - Mar 18 , 2026 | 12:54 AM

శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం 2026వ సంవ త్సరానికి వివిధ రంగాల్లో విశేష కృషి చేస్తున్న పలువురికి పురస్కారాలను ప్రకటించింది.

సతీష్‌ చందర్‌కు కళారత్న

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన

శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం 2026వ సంవ త్సరానికి వివిధ రంగాల్లో విశేష కృషి చేస్తున్న పలువురికి పురస్కారాలను ప్రకటించింది. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సతీష్‌చందర్‌ను జర్నలిజంలో కళారత్న(హంస) అవార్డుకు ఎంపిక చేశారు. అలాగే ఉగాది పురస్కారాలకు పశ్చిమలో ఏడుగురు, ఏలూరు జిల్లాలో ముగ్గురు ఎంపికయ్యారు.

కలం యోధుడు సతీష్‌ చందర్‌

నరసాపురం, మార్చి 17(ఆంధ్ర జ్యోతి): మైలాబ త్తుల సతీష్‌ చందర్‌ జర్నలిజంలో నాలు గున్నర దశాబ్దాలు గా విశేష సేవలంది స్తున్నారు. తెలుగునాట ప్రముఖ దిన పత్రికల్లో పనిచేశారు. చేయి తిరిగిన కలం యోధుడు. తన రచనలతో బాధితులకు అండగా నిలిచారు. నరసాపురం వైఎన్‌ కళాశాలలో చదువుకున్న ఆయన కొద్ది కాలం స్థానికంగా పనిచేశారు. అనంతరం హైదరా బాద్‌లో స్థిరపడ్డారు. ఉదయం, ఆంధ్రప్రభ, వార్త దినపత్రికల్లో ఎడిటర్‌, అసోసియేట్‌ ఎడిటర్‌గా పనిచేశారు. పలు పుస్తకాలు రాశారు. మంచి సాహితీవేత్తగా గుర్తింపు పొందారు. జర్నలిజంలో ఆయన చేసిన సేవలకు గాను రాష్ట్ర ప్రభుత్వం కళారత్న (హంస) అవార్డుకు ఎంపిక చేసింది.

కవితారత్నం

తాడేపల్లిగూడెం రూరల్‌ : వేమూరి శ్రీనివాస్‌ వచన కవి. సామాజిక అంశాలపై లోతైన భావం.. పదు నైన పదాలతో కవితలు రాస్తుంటారు. తాడేపల్లిగూడెం వాసవి ఇంజ నీరింగ్‌ కళాశాలలో గణిత శాస్త్ర అధ్యాపకు డిగా పనిచేస్తున్నప్పటికి తెలుగు భాషపై అపారమైన మక్కువ. సమాజం పట్ల సుని శిత దృష్టి.. సంఘటనల పట్ల లోతైన అవగా హన కలిగిన రచనలు చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు ఉగాది పురస్కారానికి ఎంపిక చేసింది.

కుంచె చెక్కిన చిత్రం

తణుకు : కుంచె చెక్కిన చిత్రకారుడు డాక్టర్‌ వెంపటాపు వెంకట సత్యనారా యణ. ఆయన కుంచె పట్టారంటే.. చిత్రం ప్రాణం పోసుకోవాల్సిందే. 35 ఏళ్లుగా చిత్రకళలో వేలాది చిత్రాలను లిఖించారు. రాష్ట్ర, జాతీ య, అంతర్జాతీయ స్థాయిల్లో 200 పైగా అవార్డులు అందుకున్న ఘనత ఆయన సొం తం. భారత ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్‌ కల్చర్‌ వారి వికసిత్‌ భారత్‌ స్పాట్‌ పెయింటింగ్‌ పోటీలలో తిరుపతి, విజయవాడలో లక్ష రూపాయల ప్రఽథమ బహుమతి సాధించారు. ఆయనతోపాటు తణుకు పట్టణానికే చెందిన మరో చిత్రకారుడు ఎస్వీ రామశాస్త్రిని కూడా ఉగాది పురస్కారాలకు ఎంపిక చేసింది.

నాద బ్రహ్మలకు నీరాజనం

పెనుమంట్ర: ఇవ్వల యేసురాజు నాదస్వరం, ఫ్లూట్‌, మాండలిన్‌, క్లారినేట్‌ వాయిద్యాలతో స్వరాలను అలవోక గా పలికించే నాద బ్రహ్మ. పెనుమంట్ర మండలం మార్టేరుకు చెందిన ఆయన విద్యాంసుడు షేక్‌లాల్‌ సాహెబ్‌ వద్ద శిష్యరికం చేశారు. 12 వందలకు పైగా ప్రదర్శనలు ఇచ్చి సంగీత ప్రియుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సాధించారు. వాసవి పెనుగొండ కళాశాలలో పార్ట్‌ టైం లెక్చరర్‌గా పనిచేస్తున్నారు. వంద మందికి పైగా సంగీత కళాకారులకు తర్ఫీదు ఇచ్చారు. పలు అవార్డులు దక్కించుకున్నారు. ఉగాది పురస్కారానికి ఎంపికయ్యారు.

భీమవరం టౌన్‌: పిప్పళ్ళ ప్రసాదరావు.. ఫ్లూట్‌, మాండలిన్‌, జాజ్‌, డ్రమ్‌ వంటి వాయిద్యాల్లో అపార విద్వత్తు సాధించా రు. భీమవరానికి చెందిన ఆయనకు ధాన్య రత్న, ధ్యాన గాన తుంబుర, సంగీత ధ్యాన కళారత్న బిరుదులు అందుకున్నారు. నేపాల్‌, థాయిలాండ్‌, భూటాన్‌, దుబాయి, సౌతాఫ్రి కా, కెన్యా తదితర దేశాల్లో ప్రదర్శనలు ఇచ్చి మన్ననలు పొందారు. కళా సాంస్కృతిక సేవ సంస్థ స్వర్ణ హస్త కంకణంతో సత్కరించింది. ఆయన ఉగాది పురస్కారానికి ఎంపికయ్యారు.

సంగీత కళానిధి

ఏలూరు రూర ల్‌ : సయ్యద్‌ శ్రీని వాస పాచ్చా సాహె బ్‌ (ఎస్‌పీఎస్‌ వా సు) సంగీత కళాని ధి. దుగ్గిరాలకు చెం దిన ఆయన వంట పాత్రలపై 12 గంటలపాటు 12 వాయిద్యా లతో స్వరాలను పలికించి నిర్విరామ సంగీత కచేరి కళాభిమానులను మంత్ర ముగ్ధులను చేశారు. గాత్రం, ఫ్లూట్‌, వయోలిన్‌, వీణలలో విశేష ప్రావీణ్యం సంపాదించిన ఆయన ఆలిండియా రేడియోలో గ్రేడ్‌ ఆర్టిస్ట్‌ ఇన్‌ కీ–బోర్డు, ఫ్లూట్‌, మ్యూజిక్‌ కంపోజర్‌గా, ఈటీవీ పాడుతా తీయగా, మా టీవీ పాడాల ని ఉంది, జీ సరిగమప, దూరదర్శన్‌ ఛానల్స్‌ లో వాయిద్య సహకారం అందించారు. 30 సంగీత వాయిద్యాలతో వందేమాతర గీతాన్ని, 40 సంగీత వాయిద్యాలతో సంపూర్ణ జనగణ మన గీతాన్ని స్వీయ సంగీత దర్శకత్వంలో రూపొందించారు. 3 వేలకు పైగా సంగీత కచేరీలు చేసిన ఆయన ఉగాది పురస్కారాన్ని అందుకోనున్నారు.

రంగస్థలం రారాజు

రంగ స్థలంపై రారాజు కామా సోమరాజు (సోమ్లా నాయక్‌). 45 ఏళ్లుగా నటుడిగా, గాయకు డిగా, రచయితగా, వ్యాఖ్యాతగా, సంగీత దర్శకుడిగా, స్టేజ్‌పై, రేడియో, దూరదర్శన్‌, జెమిని, మా టీవీలో, రాష్ట్ర, జాతీయ స్థాయి లో విభిన్న పాత్రలు పోషించారు. పెదపాడు కు చెందిన ఆయన ఏడు వేలకు పైగా ప్రదర్శనలు ఇచ్చారు. ఎన్నో బిరుదులు, పుర స్కారాలు, ప్రశంసా పత్రాలు అందుకున్నారు. మానవత ద్వారా నేటి యువతలో సృజనా త్మక కళలు, వాటిని పెంపొందించుకోవడం పాటలు, నాటికల ద్వారా, కెరీర్‌ గైడెన్స్‌ ఇస్తున్నారు. కళా రంగానికి చేస్తున్న కృషికి ఫలితమే ఉగాది పురస్కారం.

సూక్ష్మ కళలో సిద్ధహస్తుడు

నరసాపురం : కొప్పినీడి విజయ్‌ మోహన్‌. బియ్యం, పెన్సిల్‌ వంటి సూక్ష్మ వస్తువులపై అరు దైన శిల్పాలు చెక్క డంలో సిద్ధహస్తుడు. నరసాపురంలోని రుస్తుంబాద ప్రాంతానికి చెందిన ఆయన లోతైన కంటి చూపుతో సూక్ష్మ చిత్రాలను చెక్కుతూ వాటికి ప్రాణం పోస్తున్నారు. తన కళతో గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డులో చోటు దక్కించుకున్న ఆయన గవరపేట గ్రామ సర్వేయర్‌గా పని చేస్తున్నారు. ఆయన కళకు గుర్తింపుగా ప్రభుత్వం ఉగాది పురస్కారాన్ని ప్రకటించింది.

చేయి తిరిగిన కళాకారుడు

పాలకొల్లు టౌన్‌ : చిలుకూరి సూర్యప్రసాద్‌.. జర్నలిస్టు.. రచయిత, గాయకుడు. కవి త్వం, వచన కవి త్వం, గజల్స్‌, ఆధ్యా త్మిక గీతాలు, కథానికలు రచించడమే కాక, గాయకుడిగా అనేక ఆధ్యాత్మిక గీతాలు, గజ ల్స్‌, పుష్కరాలకు ఆహ్వానం వంటి అనేక ఆల్బమ్స్‌ రూపొందించి చేయి తిరిగిన కళాకారుడిగా ఖ్యాతిగడించారు. యలమంచి లికి చెందిన ఆయన 2015లో పాడిన పుష్కరాలకు ఆహ్వానం ఆల్బమ్‌ను అప్పటి, ప్రస్తుత సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. సాహిత్య విభాగంలో రాష్ట్రస్థాయి ఉగాది పురస్కారానికి ఎంపికయ్యారు.

Updated Date - Mar 18 , 2026 | 12:55 AM