పశ్చిమ రెడ్‌క్రాస్‌కు అవార్డుల పంట!
ABN , Publish Date - Sep 01 , 2026 | 12:27 AM
పశ్చిమ గోదావరి జిల్లాలో ఇండియన్ రెడ్‌క్రాస్ సేవలను విస్తరించి, నిరుపేదలకు విశేష మానవతా సేవలు అందించినందుకు కలెక్టర్ చదలవాడ నాగరాణికి 2025–26 సంవ త్సరానికి ప్రతిష్ఠాత్మక ‘గవర్నర్ గోల్డ్ మెడల్’ లభించింది.పశ్చిమ గోదావరి జిల్లాలో ఇండియన్ రెడ్‌క్రాస్ సేవలను విస్తరించి, నిరుపేదలకు విశేష మానవతా సేవలు అందించినందుకు కలెక్టర్ చదలవాడ నాగరాణికి 2025–26 సంవ త్సరానికి ప్రతిష్ఠాత్మక ‘గవర్నర్ గోల్డ్ మెడల్’ లభించింది.
కలెక్టర్ నాగరాణికి గవర్నర్ గోల్డ్ మెడల్
భీమవరం టౌన్, ఆగస్టు 31(ఆంధ్రజ్యోతి): పశ్చిమ గోదావరి జిల్లాలో ఇండియన్ రెడ్‌క్రాస్ సేవలను విస్తరించి, నిరుపేదలకు విశేష మానవతా సేవలు అందించినందుకు కలెక్టర్ చదలవాడ నాగరాణికి 2025–26 సంవ త్సరానికి ప్రతిష్ఠాత్మక ‘గవర్నర్ గోల్డ్ మెడల్’ లభించింది. విజయవాడలో మంగళవారం జరిగే ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ ఏపీ రాష్ట్ర శాఖ వార్షిక సర్వసభ్య సమావేశంలో గవర్నర్, ఏపీ రెడ్‌క్రాస్ అధ్యక్షుడు ఎస్.అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా ఆమె ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు. జిల్లాలో రెడ్‌క్రాస్ సేవల విస్తరణ, నిధుల సమీకరణ, జూనియర్, యూత్ రెడ్‌క్రాస్ సభ్యత్వ నమోదులో విశేష కృషి చేసినందుకు అప్పటి జేసీ టి.రాహుల్ కుమార్‌రెడ్డికి 2024–25 సంవత్సరానికి గవర్నర్ గోల్డ్ మెడల్ లభించింది.
రాష్ట్రస్థాయిలో ప్రథమ బహుమతి
అత్యుత్తమ సేవలు అందించినందుకు 2024–25 సంవత్సరానికి పశ్చిమ గోదావరి జిల్లా రెడ్‌క్రాస్ సొసైటీకి రాష్ట్రస్థాయిలో ప్రథమ బహుమతి లభించింది. జిల్లా రెడ్‌క్రాస్ చైర్మన్ డాక్టర్ ఎం.ఎస్.వి.ఎస్. భద్రిరాజు ఈ అవార్డును అందుకోనున్నారు. రక్తదాన శిబిరాలు, వైద్య సహాయం, తల సేమియా బాధితులకు ఉచిత రక్తమార్పిడి సేవలు, విపత్తుల సమయాల్లో సహాయక చర్యల్లో జిల్లా శాఖ ముందంజలో నిలిచింది. గత రెండేళ్లల్లో బ్లడ్ సెంటర్, తలసేమియా ట్రాన్స్ ఫ్యూజన్ సెంటర్, మొబైల్ మెడికల్ యూనిట్ వంటి కీలక ప్రాజెక్టులను అందుబాటులోకి తెచ్చామని, జిల్లాకు ఇప్పటి వరకు నాలుగుసార్లు అవార్డులు రావడం తమ సేవా నిరతికి నిదర్శనమని కమిటీ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.