వాచ్‌మన్‌పై దాడి కలకలం
ABN , Publish Date - Mar 01 , 2026 | 12:39 AM
జంగారెడ్డిగూడెంలో దారుణం చోటు చేసుకుంది. ఓ ఇంటికి నైట్ వాచ్‌మన్‌గా పనిచేస్తున్న 75 ఏళ్ల బలగం అప్పారావు అనే వృద్ధుడిని గుర్తుతెలియని దుండగులు పదునైన ఆయుధంతో తలపై మోది ఇంట్లోకి చొరబడిన ఘటన శని వారం తెల్లవారు జామున కలకలం రేపింది.
చోరీ ఘటనపై పోలీసుల విచారణ
జంగారెడ్డిగూడెం, ఫిబ్రవరి 28(ఆంధ్రజ్యోతి): జంగారెడ్డిగూడెంలో దారుణం చోటు చేసుకుంది. ఓ ఇంటికి నైట్ వాచ్‌మన్‌గా పనిచేస్తున్న 75 ఏళ్ల బలగం అప్పారావు అనే వృద్ధుడిని గుర్తుతెలియని దుండగులు పదునైన ఆయుధంతో తలపై మోది ఇంట్లోకి చొరబడిన ఘటన శని వారం తెల్లవారు జామున కలకలం రేపింది. కోర్టు వెనుక ఉన్న సూరపరాజు కాలనీకి చెందిన పెన్మెత్స లోకనాథ రాజు ఈ నెల 7వ తేదీన హైదరాబాద్ వెళ్లడంతో ఆ ఇంటి ముందు అప్పారావు వాచ్‌మెన్‌గా ఉంటున్నాడు. శనివారం తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో గుర్తుతెలియని ముగ్గురు దుండగులు వచ్చి నిద్రపోతున్న అప్పారావు తలపై మోదారు. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే రక్తపు మడుగులో పడిపోయాడు. దుండగులు తాళం బద్దలు కొట్టి లోపలికి ప్రవేశించి అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. శనివారం ఉద యం అప్పారావు రక్తపు మడుగులో పడి ఉండటం గమనించి ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. సీఐ ఎం.వి.సుభాష్, ఎస్సై ఎన్.వి.ప్రసాద్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిం చారు. అయితే ఇంట్లో చోరీ జరిగిందా లేదా అన్నది తెలియ రాలేదు. యజమాని హైదరాబాద్ నుంచి వస్తే వివరాలు తెలిసే అవకాశం ఉంది.