Share News

సురక్షిత ప్రయాణం.. కూటమి ప్రభుత్వ లక్ష్యం

ABN , Publish Date - Apr 30 , 2026 | 12:21 AM

వాహన ప్రమాదాలు జరగకుండా ప్రజలు సురక్షితమైన ప్రయాణాలు చేయడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి అన్నారు.

 సురక్షిత ప్రయాణం..  కూటమి ప్రభుత్వ లక్ష్యం
ఏటీఎస్‌ కేంద్రాన్ని ప్రారంభిస్తున్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి.. చిత్రంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ తదితరులు

రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి రాంప్రసాద్‌రెడ్డి

జిల్లాలో ఆటోమేటెడ్‌ వాహన స్టేషన్‌ ప్రారంభం

ఏలూరు క్రైం, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి):వాహన ప్రమాదాలు జరగకుండా ప్రజలు సురక్షితమైన ప్రయాణాలు చేయడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి అన్నారు. ఏలూరు సమీపంలోని కలపర్రు పాతటోల్‌గేటు దగ్గరలో రూ.3.50 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం పొందిన పద్మవో ఆటోటెక్‌ సర్వీసెస్‌ వాహన ఫిట్‌నెస్‌ కేంద్రం ఆటోమేటెడ్‌ వాహన టెస్టింగు స్టేషన్‌ (ఏటీఎస్‌)ను బుధవారం మంత్రి ప్రారంభించారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ వేగంతో పాటు పారదర్శకమైన సేవలు అందించేందుకు ఈ ఆటోమేటెడ్‌ టెస్టింగు స్టేషన్లను సద్వినియోగం చేసుకోవాల న్నారు. వాహనాలు ఫిట్‌నెస్‌ను ఖచ్చితంగా, పారదర్శకంగా పరీక్షించే సౌకర్యా లు ఈ కేంద్రంలో అందుబాటులో ఉంటాయన్నారు. వాహన ఫిట్‌నెస్‌ టెస్ట్‌కు కొత్త పద్ధతి 9 పరీక్షలు పాసైతే నిముషాల్లోనే ధ్రువపత్రం పొందవచ్చన్నారు. ఖచ్చితమైన ఫిట్‌నెస్‌, వాహనం కండీషన్‌లో ఉందని యంత్రాలు నిర్ధారిస్తేనే ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ జారీ చేయబడుతుందన్నారు. ఎమ్మెల్యే చింతమనేని మాట్లాడుతూ నూతన సాంకేతికతతో వాహన భద్రతకు మరింత ప్రాధాన్యం పెరిగి, ఆటోమేటెడ్‌ టెస్టింగు స్టేషన్లతో రవాణా రంగానికి నూతనశకం ప్రారంభమైందన్నారు. ఉపరవాణా కమిషనర్‌ కరీం, జిల్లా ప్రజా రవాణాధికారి షబ్నమ్‌, సెట్‌వెల్‌ సీఈవో ప్రభాకరరావు, దెందులూరు ఏఎంసీ చైర్మన్‌ గారపాటి రామసీత, జిల్లా రవాణాశాఖ, ఏపీఎస్‌ ఆర్టీసీ అధికారులు, పద్మవో ఆటోటెక్‌ యాజమాన్య ప్రతినిధులు అభినవ, ఉదయ్‌ తదితరులు పాల్గొన్నారు. తొలుత మంత్రికి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ వెంకటేశ్వరస్వామి చిత్ర పటం అందించి, స్వాగతం పలికారు.

Updated Date - Apr 30 , 2026 | 12:21 AM