20 మద్యం దుకాణాలకు రెన్యువల్ ప్రక్రియ
ABN , Publish Date - Sep 17 , 2026 | 12:29 AM
ప్రభుత్వ ఆదేశా ల మేరకు నూజివీడు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 20 మద్యం దుకాణాలకు రెన్యువల్ ప్రక్రియ చేపట్టామని ఏలూరు జిల్లా ఎక్సైజ్ అసిస్టెంట్ డిప్యూటీ కమిషనర్ బి.శ్రీలత, జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి ఎ.అవులయ్య తెలిపారు.
నూజివీడు, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి) : ప్రభుత్వ ఆదేశా ల మేరకు నూజివీడు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో 20 మద్యం దుకాణాలకు రెన్యువల్ ప్రక్రియ చేపట్టామని ఏలూరు జిల్లా ఎక్సైజ్ అసిస్టెంట్ డిప్యూటీ కమిషనర్ బి.శ్రీలత, జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి ఎ.అవులయ్య తెలిపారు. బుధవారం నూజి వీడు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సర్కిల్ కార్యాలయాన్ని వారు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు రికార్డులను పరిశీలించి, సిబ్బందికి సూచనలు చేశారు. అనంతరం నూజివీడు స్టేషన్ పరిధిలోని మద్యం దుకాణాల నిర్వాహుకులకు మద్యం దుకాణాల రెన్యువల్ ప్రక్రియపై అవగాహన కార్యక్రమం నిర్వహిం చారు. ఈనెల 21వ తేదీలోపు రెన్యువల్ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని, నిర్ణీత గడువులోగా రెన్యువల్ చేసుకోని దుకాణాలకు సంబంధించి తదుపరి కేటాయింపు ప్రక్రియలో భాగంగా లాటరీ విధానం అమలు చేయనున్నట్టు వివరించారు.
నూజివీడు పరిధిలో పైలట్ ప్రాజెక్టుగా ‘మార్పు’
రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా ‘మార్పు’ కార్యక్రమాన్ని నూజివీడు సర్కిల్ పరిధిలో ఫైలట్ ప్రాజెక్టుగా అమలు చేస్తామని అసిస్టెంట్ డిప్యూటీ కమిషనర్ శ్రీలత తెలిపారు. సారా తయారీకి పాల్పడుతున్న వారిని గుర్తించి, వారికి అవగా హన కల్పించడం ద్వారా వారి జీవన విధానంలో మార్పు తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టినట్టు వివరించారు. దీనిలో భాగంగా జీవనోపాధి అవసరమున్న 30 మందిని గుర్తించి స్వయం ఉపాధి అవకాశాలు కల్పించినట్టు తెలిపారు. నూజివీడు ఎక్సైజ్ సీఐ ఎ.మస్తానయ్య, తదితరులు పాల్గొన్నారు.