కమల భౌతిక కాయం ఆశ్రం వైద్య కళాశాలకు అప్పగింత
ABN , Publish Date - Apr 15 , 2026 | 12:39 AM
మండలం లోని ఎర్రగుంటపల్లి గ్రామానికి చెందిన పాములపాటి కమల(86) గుండె పోటుతో మృతి చెందారు.
కమల భౌతిక కాయం ఆశ్రం వైద్య కళాశాలకు అప్పగింత
చింతలపూడి, ఏప్రిల్ 14(ఆంధ్రజ్యోతి): మండలం లోని ఎర్రగుంటపల్లి గ్రామానికి చెందిన పాములపాటి కమల(86) గుండె పోటుతో మృతి చెందారు. ఆమె శరీ రాన్ని వైద్య పరిశోధనల నిమిత్తం ఏలూరు ఆశ్రం వైద్య కళాశాలకు కుటుంబ సభ్యుల అంగీకారంతో అందజేశా రు. కమల ప్రముఖ నాయకుడు పాములపాటి నారా యణ సతీమణి.. ఈ కుటుంబానికి నియోజకవర్గంలో రాజకీయ పార్టీ నేతలతో సన్నిహిత, బంధుత్వ సంబంధా లున్నాయి. తల్లి మృతి చెందిన బాధలో ఉన్నప్పటికీ ఆమె కుమారుడు రిటైర్డ్ సింగరేణి అధికారి పి.శ్యాంసుందర్ రెడ్డి, కుమార్తెలు కంఠం సరళ, జగ్గవరపు సుధారాణి, పాములపాటి రాధారాణి తమ తల్లి శరీరాన్ని వైద్య పరిశోధనలకు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఆశ్రం వైద్య కళాశాల సిబ్బంది ఎర్రగుంటపల్లి గ్రామానికి చేరుకుని భౌతికకాయాన్ని కళాశాలకు తరలించారు.