Share News

అరుణాచలం, బెంగళూరు రైళ్ల పునరుద్ధరణ

ABN , Publish Date - Apr 06 , 2026 | 12:18 AM

ఆంధ్రజ్యోతిలో ఆదివారం ప్రచురితమైన ‘రైల్వే షాక్‌’ వార్తకు కేంద్ర మంత్రి శ్రీని వాసవర్మ స్పందించారు.

అరుణాచలం, బెంగళూరు రైళ్ల పునరుద్ధరణ

నరసాపురం,ఏప్రిల్‌ 5 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రజ్యోతిలో ఆదివారం ప్రచురితమైన ‘రైల్వే షాక్‌’ వార్తకు కేంద్ర మంత్రి శ్రీని వాసవర్మ స్పందించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పట్టాలెక్కించిన స్పెషల్‌ రైళ్లు అరుణాచలం, కేఎస్‌ఆర్‌ బెంగళూరు రైళ్లు పొడిగింపునకు రైల్వే నో అంటూ ప్రచురి తమైన వార్తకు ఆయన స్పందించారు. ప్రస్తుతం కేరళంలో ఉన్న మంత్రి రైల్వే అధికారులతో మాట్లాడారు. రద్దుకు గల కారణాలను అడిగి తెలుసు కున్నారు. మంత్రి ఆదేశాలతో రైల్వే యుద్ధ ప్రాతిపదికన ఈ రైళ్లను పునరుద్ధరించింది. వాటి షెడ్యూల్‌ సమ యాలను రైల్వే వెబ్‌సైట్‌, ఐఆర్‌సీటీ బుకింగ్‌లోనూ వెల్లడిం చింది. గతంలో మాదిరిగానే ఈ రెండు రైళ్లు వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ లుగా నడవనున్నాయి. రైల్వే విడుదల చేసిన షెడ్యూల్‌ ప్రకారం అరుణాచలం (07219) రైలు ఈనెల 8 నుంచి మే 27 వరకు పొడిగించారు. తిరుగు ప్రయాణంలో అరుణాచలం–నరసాపురం (07220) రైలును ఈనెల 9 నుంచి మే 28 వరకు పొడిగిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నరసాపురం–బెంగళూరు (07153) ఎక్స్‌ప్రెస్‌ ఈనెల 10 నుంచి మే 29 వరకు, తిరుగు ప్రయాణంలో 07154 నంబర్‌తో బెంగళూరు నుంచి నరసాపురం వరకు ఈనెల 11 నుంచి మే 30 వరకు పొడిగిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నరసాపురం నుంచి ప్రతి ఆదివారం నడిచే చర్లపల్లి ఎక్స్‌ప్రెస్‌ గురించి ఇంకా ఎటువంటి ప్రకటన చేయలేదు.

Updated Date - Apr 06 , 2026 | 12:18 AM