పిల్లల విక్రయాల్లో ఏడుగురి అరెస్టు
ABN , Publish Date - Mar 24 , 2026 | 12:46 AM
పిల్లల విక్రయాల కేసులో ఏడుగురిని అరెస్టు చేసినట్లు ఏలూరు జిల్లా కైకలూరు రూరల్ సీఐ వి.రవికుమార్ తెలిపారు.
ఇద్దరు పిల్లల విషయంలో చేతులు మారిన నగదు
ప్రధాన నిందితురాలు ఫరీదాను కస్టడీకి అడగనున్న పోలీసులు
కైకలూరు, మార్చి 23(ఆంధ్రజ్యోతి):పిల్లల విక్రయాల కేసులో ఏడుగురిని అరెస్టు చేసినట్లు ఏలూరు జిల్లా కైకలూరు రూరల్ సీఐ వి.రవికుమార్ తెలిపారు. సోమవారం కైకలూరులోని తన కార్యాల యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చెప్పిన వివరాలివి.. ఈ నెల 14న జిల్లా బాలల సంరక్షణ అధికారిణి సూర్యచక్రవేణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టాం. కొంత మంది ఐదుగురు పిల్లలను దత్తత తీసుకుని పెంచుకున్నారు. వారిలో ఇరువురి పిల్లల విషయంలో నగదు చేతులు మారినట్లు గుర్తించాం. ముదినేపల్లి మండలం అన్నవరానికి చెందిన దూలం రాంప్రసాద్, సునీత దంపతులు తమ దగ్గర బంధువైన అబ్బిశెట్టి వీరకుమారి అలియాస్ వీరమ్మ ద్వారా విజయవాడకు చెందిన ఫరీదాను సంప్రదించారు. ఫరీదా ద్వారా తీసుకున్న పిల్లకు రూ.3 లక్షలు నగదు చెల్లించారు. అప్పటి నుంచి పిల్లను తీసుకుని దూలం రాం ప్రసాద్ భార్యతో కలిసి మచిలీపట్నంలో ఓ దుకాణం నిర్వహిస్తూ తొమ్మిది నెలలపాటు అక్కడే ఉండి తర్వాత బిడ్డను కన్నట్టు ఆ పాపతో స్వగ్రామానికి వచ్చారు. అప్పటి నుంచి ఆ పాప వారి సంరక్షణలోనే పెరుగుతోంది. మండవల్లి మండలం కానుకొల్లుకు చెందిన ఒక కుటుంబానికి పిల్లలు లేకపోవడంతో ఏలూరు జనని ఆసుపత్రిలో ఒక మగ పిల్లవాడిని మహిళ జన్మనిచ్చింది. పిల్లవాడిని పెంచుకోవడానికి తల్లి సుముఖత చూపకపోవడంతో వారి బంధువైన వీరమ్మ, ఆసుపత్రి నర్సు కందులూరి మావుళ్ళమ్మ (మాఽధురి)ల ద్వారా ఆసుపత్రి ఖర్చుల నిమిత్తమై రూ.80 వేలు ఇచ్చి పిల్లవాడిని పెంచుకుంటున్నారు. 2012లో తామరకొల్లులో వీరమ్మ బంధువులకు పిల్లలు లేకపోవడంతో గొల్లగూడేనికి చెం దిన పరసా నాగ బాబుకు ఇద్ద రు ఆడపిల్లలు ఉం డగా వారిలో ఒక పాప అనారోగ్యానికి గురైంది. ఆ పాపకు వైద్యం చేయించి వారు దత్తత తీసు కుని 14 ఏళ్లుగా పెంచు కుంటున్నా రు. ఈ దత్తతను చట్టప్రకారంగా చేసు కోలేదు. మరో ఇద్దరు ఆడ పిల్లలను వారి తల్లిదండ్రులు ఇష్ట పూర్వకంగానే పెంచుకునేందుకు బంఽధువులలో ఇచ్చారు. ఈ కేసులో ప్రధానంగా విజయవాడకు చెందిన ఫరీదా పిల్లల అక్రమ రవాణాలో పాత్ర ఉండడంతో పలు కేసులపై రాజమండ్రి సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తోంది. ఈ నెల 21న వారెంట్‌పై ఆమెను తీసుకువచ్చి కైక లూరు కోర్టుకు హాజరుపరిచి తిరిగి రాజమండ్రి సెంట్రల్ జైలుకు పంపించాం. పలు కేసుల్లో ఫరీదాకు సంబంధం ఉండడంతో కోర్టు ద్వారా పోలీసు కస్టడీకి తీసుకోనున్నాం. ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లేకపోయినా చైల్డ్ ప్రొడక్ట్ అధికారిణి ఫిర్యాదు మేరకు సాంకేతిక పరిజ్ఞానంతో దొరికిన ఆధారాలను బట్టి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నాలుగు టీంలుగా ఏర్పడి విచారణ చేశాంు. కేసులో ఇప్పటి వరకు అబ్బిశెట్టి వీరమ్మ, ముదినేపల్లికి చెందిన వలివెల గోపి, కలిదిండికి చెందిన చిట్టూరి మేరి, ఉండి మండలం చెరుకువాడకు చెం దిన ఉండి చెల్లమ్మ, ఏలూరుకు చెందిన కందులూరి మావుళ్ళమ్మ (మాధురి), తంగెళ్ళముడికి చెందిన మహ్మద్ ఖాలిక్ అహ్మద్‌లను అరెస్టు చేశాం’ అని తెలిపారు. ముదినేపల్లి ఎస్సై వీరభద్రరావు, పాల్గొన్నారు.