Share News

ఆర్నబ్‌ గండం!

ABN , Publish Date - Oct 27 , 2026 | 01:01 AM

ఆర్నబ్‌ తుఫాన్‌ దూసు కొస్తోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు రెడ్‌ అలెర్ట్‌ జారీ చేశారు. జిల్లా యంత్రాంగం అప్రమత్తమై ప్రాణ, ఆస్తి నష్టాలు జరగకుండా ముంద స్తు చర్యలు చేపడుతున్నారు.

ఆర్నబ్‌ గండం!
నరసాపురం మండలం పీఎంలంక వద్ద సముద్రంలో ఎగసిపడుతున్న ఆలలు

తుఫాన్‌గా మార్పు చెందిన తీవ్ర వాయుగుండం

నేటి నుంచి జిల్లాలో భారీగా వర్షాలు కురిసే అవకాశం

రేపు తెల్లవారుజామున తీరం దాటే అవకాశం

జిల్లాకు రెడ్‌ అలర్ట్‌ జారీ ..8 నేడు, రేపు విద్యా సంస్థలకు సెలవు

రైతులకు వ్యవసాయాధికారుల సూచనలు

విద్యుత్‌ శాఖ అప్రమత్తం.. ముందస్తు చర్యలు

అధికారులు అప్రమత్తంగా ఉండాలి : కలెక్టర్‌

(ఏలూరుసిటీ–ఆంధ్రజ్యోతి)

ఆర్నబ్‌ తుఫాన్‌ దూసు కొస్తోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు రెడ్‌ అలెర్ట్‌ జారీ చేశారు. జిల్లా యంత్రాంగం అప్రమత్తమై ప్రాణ, ఆస్తి నష్టాలు జరగకుండా ముంద స్తు చర్యలు చేపడుతున్నారు. ఖరీఫ్‌ వరిపంట కోత దశలో వర్షాలు కురిస్తే తీవ్ర నష్టం తప్ప దని రైతులు ఆందోళన చెందుతు న్నారు. తుఫాన్‌ తీవ్రత దృష్ట్యా జిల్లాలో ఈనెల 27,28 తేదీల్లో పాఠశాలలకు, కళాశాల లకు, అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తుఫాన్‌గా రూపాంతరం చెందింది. తీవ్ర తుఫాన్‌గా మారనుంది. సోమవారం అర్ధరాత్రికి ఇది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుఫాన్‌గా, మంగ ళవారం అతి తీవ్ర తుఫాన్‌గా మారనుంది. అక్టోబరు 28 ఉదయం బాపట్ల– విశాఖ మధ్య యానాం సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. ఆ సమయంలో 115 నుంచి గరిష్ఠంగా 140 కిలోమీటర్లు వేగం తో పెనుగాలులు వీస్తాయని చెబుతున్నా రు. మంగళ, బుధవారాలలో అత్యంత భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్టు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మంగళవారం కోస్తా తీరం వెంబడి 90 నుంచి 100 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతా వరణశాఖ చెబు తోంది. ఈ క్రమంలో చెట్లు, భారీ హోర్డింగ్‌ లు, శిథిలావస్థ లో ఉన్న భవనా లు, పూరి గుడి సెలలో ఉండరాదని, పల్లపు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని, అవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఆర్నబ్‌ తుఫాన్‌ తీవ్రత దృష్ట్యా ఈనెల 29వ తేదీ వరకు అఽధికారు లందరూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ వెట్రిసెల్వి ఆదేశాలు జారీ చేశారు. కలెక్టరేట్‌లో సోమవారం తుఫాన్‌ తీవ్రత, నష్ట నివా రణాలపై అధి కారులతో కలెక్టర్‌ సమీక్షించారు. జిల్లాలో ఎటు వంటి ప్రాణ, ఆస్తి నష్టాలు కలుగకుండా ముం దస్తు ప్రణాళికలు రూపొందించాలన్నారు. కలెక్టరేట్‌లో 18002331077, 08812–224519, 9491041419 ఫోన్‌ నెంబర్లతో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశామన్నారు. సమీక్షలో జేసీ అభిషేకగౌడ తో పాటు జిల్లా అధికారులు పాల్గొన్నారు.

రెడ్‌ అలర్ట్‌ జారీ

బంగాళాఖాతంలో ఏర్పడిన ఆర్నబ్‌ తుఫాన్‌ ప్రభావంతో ఏలూరు జిల్లాకు రెడ్‌ అలెర్ట్‌ జారీ చేశారు. మంగళవారం జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని, బోట్లు, వలలు సురక్షిత ప్రాంతాల్లో జాగ్రత్తగా కట్టి ఉంచుకోవాలని అధికారులు సూచించారు. ఈనెల 27,28 తేదీల్లో ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని చెబుతున్నారు.

విద్యుత్‌శాఖ కంట్రోలు రూమ్స్‌

తుఫాన్‌ నేపథ్యంలో జిల్లాలో విద్యుత్‌ సరపరాకు అంతరాయం కలుగకుండా ఎటువంటి విపత్కర పరిస్థితులనైనా సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు ఏపీఈ పీడీసీఎల్‌ విద్యుత్‌ శాఖ అధికారులను, సిబ్బందిని అప్రమత్తం చేసినట్టు ఏపీఈపీ డీసీఎల్‌ ఏలూరు అపరేషన్‌ సర్కిల్‌ పర్యవేక్షక ఇంజనీర్‌ కేఎం అంబేడ్కర్‌ తెలిపారు. తుఫాన్‌ ప్రభావిత పరిస్థితు లను నిరంతరం పర్యవేక్షించేందుకు , విద్యుత్‌ అంతరాయాలపై ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు ఏలూరు సర్కిల్‌ కార్యాలయం, విద్యుత్‌ భవన్‌, ఆర్‌ఆర్‌పేట, ఏలూరు : 94409 02926, ఏలూరు డివిజన్‌ కార్యాలయం : 94409 04037, జంగారెడ్డిగూడెం డివిజన్‌ కార్యాలయం : 94910 30712 నం బర్లతో 24 గంటల పాటు మూడు షిప్టులలో పనిచేసే విధంగా కంట్రో ల్‌ రూమ్‌లను ఏర్పాటు చేశామ న్నారు. విద్యుత్‌ సంబంధిత ఫిర్యాదులను టోల్‌ ఫ్రీ నెంబర్‌ 1912 ద్వారా కూడా తెలప వచ్చన్నారు. తుఫాన్‌, భారీ వర్షాలు, ఈదురు గాలు లు సమయంలో విద్యు త్‌ ప్రమాదాలు సంభ వించే అవకాశం ఉన్నందున ప్రజలు అప్ర మత్తంగా ఉండాలని సూచించారు.

విద్యాసంస్థలకు రెండు రోజులు సెలవు

ఏలూరు అర్బన్‌ : ఆర్నబ్‌ తుఫాన్‌ ప్రభావం దృష్ట్యా విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని జిల్లాలోని అన్ని యాజమాన్యాల పాఠశాలలు, కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు మంగళ, బుధవారాల్లో సెలవు ప్రకటించినట్టు కలెక్టర్‌ వెట్రిసెల్వి, డీఈవో వెంకటలక్ష్మమ్మ వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. విద్యాసంస్థలకు రెండు రోజుల పాటు సెలవు విషయాన్ని సంబంధిత విద్యార్థులు, తల్లిదండ్రులకు తెలపాలని విద్యాధికారులను ఆదేశించారు.

అన్నదాతల కలవరం

జంగారెడ్డిగూడెం రూరల్‌/చాట్రాయి/ కలిదిండి,అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి) ఖరీఫ్‌ వరి కోతల వేళ ఆర్నబ్‌ తుఫాన్‌ ముప్పు రైతుల గుండెల్లో గుబులు రేపుతోంది. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో ఖరీఫ్‌లో వరి సాగు చేయాలా.. వద్దా.. అన్న సందిగ్ధంలో రైతులు తర్జనభర్జన పడ్డారు. చివరకు ప్రకృతినే నమ్ము కుని దేవుడిపై భారం వేసి సాగుకు దిగారు. సాగునీటి విషయంలో తొలుత ఆందోళన నెలకొన్నా.. సెప్టెంబరులో కురిసిన వర్షాలతో కొంత భరోసా లభించింది. ప్రస్తుతం పైరు కోత దశకు చేరుకుంది. జిల్లా వ్యాప్తంగా సుమారు 1,98,300 ఎకరాల్లో వరి సాగైంది. చేతికొచ్చిన పంట కోతకు సిద్ధంగా ఉన్న సమయంలో భారీ వర్షాలు కురిస్తే తీవ్రంగా నష్టపోతామని రైతులు ఆందోళన చెందుతున్నారు. నెలల తరబడి కష్టపడి పండించిన పంటను కాపాడుకోవడం రైతులకు సవాల్‌గా మారింది. చాట్రాయి మండలంలో బోరుబావుల ఆఽధారంగా రైతులు తొమ్మిది వేల ఎకరాల్లో వరి, మరో రెండు వేల ఎకరాల్లో పత్తి, మిరప సాగు చేశారు. ప్రస్తుతం చాట్రాయి, బూరుగుగూడెం, ఆరుగొలనుపేట గ్రామాల్లో మూడు వేల ఎకరాల్లో వరి పంట కోతకు రావడంతో అక్కడక్కడా కోతలు కోస్తున్నారు. కలిదిండి మండలంలో ప్రస్తుతం వరిపైరు గింజపాలు పోసుకునే దశలో ఉంది. ఈ దశలో ఈదురుగాలుతో కూడిన భారీ వర్షాలు పడితే వరి పంట సర్వనాశం అయ్యే ప్రమాదం ఉందని అన్నదాతలు కలవర పడుతున్నారు. వరిపైరు నేలకొరిగి నీటిపాలవుతుందని వాపోతున్నారు. ఎకరానికి రూ.30 వేల వరకు పెట్టుబడి పెట్టారు. పంటను కాపాడుకోవడానికి పొలాల్లో నీరు బయటకు పోవడానికి దారులు ఏర్పాటు చేసుకుంటున్నారు. మురుగు కాల్వల్లో పూడికను తొలగిస్తున్నారు. పత్తి, మిరప పంటలు దెబ్బతినే అవకాశం ఉంది. వాతావరణ శాఖ హెచ్చరికలను రైతులు పాటిస్తూ పంటలను కాపాడుకోవాలని, రాబోయే మూడు రోజులు రైతులు వరి కోతలు వాయిదా వేసుకోవాలని చాట్రాయి, కలిదిండి ఏవోలు శివశంకర్‌ విద్యాసాగర్‌ సూచించారు. నేడు, రేపు పలు రైళ్లు రద్దు

ఏలూరు క్రైం, అక్టోబరు 26(ఆంధ్ర జ్యోతి):ఆర్నబ్‌ తుఫాను కారణంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మీదుగా వెళ్తున్న పలు రైళ్లను ఈ నెల 27, 28 తేదీలలో రద్దు చేస్తున్నట్లు దక్షిణ కోస్తా రైల్వే అధికారులు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 27న 67258 విజయవాడ – నర్సా పురం, 67246 నర్సాపురం – రాజమండ్రి, 17269 విజయవాడ – నర్సాపురం, 17264 నర్సాపురం – భీమవరం, 17257 విజయ వాడ – కాకినాడ పోర్టు, 67202 విజయ వాడ – రాజమండ్రి, 67257 విజయవాడ – నర్సాపురం, 67247 నర్సాపురం – గుంటూ రు, 67276 నర్సాపురం – విజయవాడ, 673 01 రాజమండ్రి – కాకినాడ పోర్టు, 67261 రాజమండ్రి – విజయవాడ రైళ్లు రద్దయ్యా యి. అలాగే ఈనెల 28న 67261 రాజ మం డ్రి – విజయవాడ, 67275 విజయవాడ – భీమవరం, 67277 భీమవరం – నిడదవోలు, 67278 నిడవోలు – భీమవరం, 67251 భీమ వరం – మచిలీపట్టణం, 67302 కాకినాడ పోర్టు – రాజమండ్రి, 67244 నర్సాపురం – నిడదవోలు, 67245 నిడదవోలు – నర్సా పురం, 17270 నర్సాపురం – విజయవాడ, 67281 విజయవాడ – భీమవరం, 67283 భీమవరం – నిడదవోలు, 67284 నిడద వోలు – భీమవరం, 67282 భీమవరం – విజయవాడ, 67262 విజయవాడ – రాజ మండ్రి, 17258 కాకినాడ పోర్టు – విజయ వాడ రైళ్లను రద్దు చేశారు.

Updated Date - Oct 27 , 2026 | 01:01 AM