సేంద్రియ ఆహారంతో ఆరోగ్యం
ABN , Publish Date - Apr 18 , 2026 | 11:50 PM
సేంద్రియ ఆహారంతో ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ప్రకృతి వ్యవసాయ రైతులకు అండగా నిలవాలని కలెక్టర్ వెట్రిసెల్వి పిలుపునిచ్చారు.
కలెక్టర్ వెట్రిసెల్వి.. ఏలూరులో సేంద్రియ ఉత్పత్తుల మెగా మేళా
ఏలూరు సిటీ, ఏప్రిల్ 18(ఆంధ్రజ్యోతి):సేంద్రియ ఆహారంతో ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ప్రకృతి వ్యవసాయ రైతులకు అండగా నిలవాలని కలెక్టర్ వెట్రిసెల్వి పిలుపునిచ్చారు. రాష్ట్రంలోనే తొలిసారిగా సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల తొలిరోజు మెగామేళాను డీసీఎంఎస్ ఫంక్షన్ హాలులో శనివారం ఆమె ప్రారంభించి మాట్లాడారు. రెండు రోజులు జరిగే ఈ మేళా ప్రధాన ఉద్దేశం సేంద్రియ, సహజ వ్యవసాయ ఉత్పత్తులను ప్రోత్సహించడం, రైతుల ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు విక్రయించడమన్నారు. దెందు లూరు, ఉంగుటూరు ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, పత్సమట్ల ధర్మ రాజు, డీసీఎంఎస్ చైర్మన్ చాగంటి మురళీకృష్ణ(చిన్న) మాట్లాడుతూ జిల్లాలో ఆర్గానిక్ వ్యవసాయ ఉత్పత్తులను మరింత ప్రోత్సహించి, ఆరోగ్య ఏలూరు జిల్లాగా మార్చేందుకు కలసికట్టుగా కృషి చేద్దామన్నారు. 80 మంది రైతులు 180 రకాల సేంద్రియ ఉత్పత్తులను స్టాల్స్‌లో ప్రదర్శించారు. వ్యవసాయ శాఖ జేడీ షేక్ హబీబ్‌బాషా, ఏపీఎంఐపీ పీడీ రామ్మోహన్, జిల్లా ఉద్యానవన అధికారి షాజానాయక్, డీఆర్‌డీఏ పీడీ విజయలక్ష్మి, ప్రకృతి వ్యవసాయ జిల్లా మేనేజర్ వెంకటేష్, మెప్మా పీడీ రాజబాబు, డీసీవో శ్రీనివాసరావు తది తరులు పాల్గొన్నారు.