Share News

దూసుకొస్తోంది

ABN , Publish Date - Nov 19 , 2026 | 12:03 AM

బంగాళాఖాతంలో ఏర్పడిన అక్వాన్‌ బుధవారం తీవ్ర తుఫాన్‌గా మారింది. గంట గంటకు తన గమనాన్ని మార్చుకుంటూ దూసుకొస్తుండటంతో ప్రజలకు కంటి మీద కునుకు లేదు.

దూసుకొస్తోంది
నరసాపురం మండలంలో ఎగసిపడుతున్న అలలు

అక్వాన్‌ తుఫాన్‌ నరసాపురం–పూరి మధ్య తీరం దాటే అవకాశం

సముద్రం నుంచి పెరిగిన గాలులు..

నేటి నుంచి భారీ వర్షాలు

అతి తీవ్ర తుఫాన్‌.. కంట్రోల్‌ రూమ్‌ల ఏర్పాటు

ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అక్వాన్‌ బుధవారం తీవ్ర తుఫాన్‌గా మారింది. గంట గంటకు తన గమనాన్ని మార్చుకుంటూ దూసుకొస్తుండటంతో ప్రజలకు కంటి మీద కునుకు లేదు. పూరి–నరసాపురం మధ్య తీరం దాటే అవకాశం ఉందన్న ఐఎండీ హెచ్చరికతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. అర్నబ్‌ తుఫాన్‌ సృష్టించిన విధ్వంసం నుంచి ఇప్పుడే తీర ప్రాంత వాసులు తేరుకుంటున్నారు. ఈ తరుణంలో మరో తుఫాన్‌ తీరాన్ని తాకితే ఏ ప్రళయం సృష్టిస్తుందోనన్న భయం నెలకొంది.

నరసాపురం, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): నరసా పురం, మొగల్తూరు మండలాల్లోని సముద్ర తీర ప్రాం తంలో బుధవారం సాయంత్రం వాతావరణం ఒక్క సారిగా మారిపోయింది. ఆకాశం ఎర్రగా మారింది. మేఘాలు కమ్మేసాయి. భారీ వర్షం కురుస్తుందన్న భయం నెలకొంది. సముద్ర గాలులు పెరిగాయి. కెర టాలు ఎగసిపడుతున్నాయి. ప్రజలు బిక్కుబిక్కుమం టూ ఇళ్ల వద్దే గడిపారు. తుఫాన్‌ కారణంగా గురువా రం నుంచి మూడు రోజులపాటు భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరి కలు జారీచేసింది. శుక్ర, శనివారాల్లో వర్షంతోపాటు బలమైన గాలులు వీస్తాయి. తుఫాన్‌ తీరంలో దాటే సమయంలో 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. సముద్ర అలలు రెండు, మూడు మీటర్ల వరకు ఎగసిపడే అవకాశం ఉంది. ప్రజలు ఎవరూ బయటకు రావద్దని హెచ్చరికలు జారీచేసిం ది. వేటకు వెళ్లిన మత్స్యకారులంతా తీరానికి చేరుకుని, బోట్లను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

అధికారుల అప్రమత్తం

ఇటు తుఫాన్‌ హెచ్చరికతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. నరసాపురం సబ్‌ కలెక్టర్‌ కార్యాల యంలో నెంబర్‌ 93911 85874తో కంట్రోల్‌ రూమ్‌ను ఏర్పాటుచేశారు. తుఫాన్‌ తీరం దాటే వరకు అధికారు లంతా అందుబాటులో ఉండి, సమాచారాన్ని ఎప్పటి కప్పుడు కంట్రోల్‌ రూమ్‌లకు తెలియజేయాలని ఆర్డీవో దాసి రాజు ఆదేశాలు జారీచేశారు. నరసాపురం, మొగల్తూరు మండలాల్లో తుపాన్‌ భవనాలను సిద్ధం చేస్తున్నారు.

చర్చంతా తుఫాన్‌ పైనే

రెండు రోజుల నుంచి వేడెక్కిన ఎన్నికల వాతావర ణం తుఫాన్‌ హెచ్చరికలతో చల్లబడింది. ఎక్కడ చూ సినా.. రాజకీయం మాని.. తుఫాన్‌ గురించే చర్చించు కుంటున్నారు. తీరం ఎక్కడ దాటుతుంది, గతంలో మాదిరి ఈదురుగాలులు వీస్తాయా? మళ్లీ అంధకారం తప్పదా..? అన్న ఆందోళనలో గ్రామస్థులు ఉన్నారు. గత తుఫాన్‌ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ముం దస్తుగా నిత్యావసర వస్తువులను సిద్ధం చేసుకుంటు న్నారు. కూరగాయలతోపాటు బియ్యం, కంది పప్పు, నూనె వంటి వస్తువులను కొనుగోలు చేస్తున్నారు.

పరుగులు పెడుతూ పంట మాసూళ్లు

భీమవరం రూరల్‌ : అక్వాన్‌ తుఫాన్‌ రైతులను మరింత కంగారుకు గురిచేస్తోంది. దీంతో గడిచిన రెండు రోజులుగా తాడేపల్లిగూడెం, గణపవరం తదితర ప్రాంతాల్లో పంట మాసూళ్లకు పరుగులు పెడున్నారు. ఈ రెండు రోజుల్లోనే తొమ్మిది వేల ఎకరాల వరకు మాసూళ్లు జరిగాయి. మొత్తం మీద 19 వేల ఎకరాలు గట్టుకు చేరింది. మిగిలిన సాగంతా గత తుఫాన్ల ముంపులో ఉండటం వలన వర్షపు నీరు బయటకు వెళ్తే కానీ పంట మాసూళ్లు వీలుకాదు. ఇప్పుడిప్పుడే ముంపు నీరు తగ్గుముఖం పడటంతో మరో వారం గడిస్తే చాలా ప్రాంతాల్లో మాసూళ్లు చేసుకునే అవకాశం ఉంటుంది.

ఈ ఆలోచన ఉన్న రైతాంగానికి అక్వాన్‌ తుఫాన్‌ భయంగా మారింది. తీరం వెంబడి తుఫాన్‌ స్లోగా రావడంతో తీవ్రత తగ్గడంతోపాటు దిశ మార్చుకుం టుందని వాతావరణ శాఖ చెప్పడంతో రైతులు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. దీని ప్రకారం జిల్లాపై తుఫాన్‌ ప్రభావం తక్కువనే అంచనా వేస్తున్నారు. బుధవారం ఎండగానే ఉండటంతో రైతులకు పంట మాసూళ్లకు వీలైంది. ఇతర ప్రాంతాల నుంచి పంట కోత యంత్రాలు పెద్ద సంఖ్యలో జిల్లాకు వచ్చాయి.

రెండు, మూడు రోజులుగా వరికోత యంత్రాలతో ధాన్యాన్ని గట్టుకు చేరుస్తు న్నారు. ధాన్యం ఎండ బెట్టే ఆస్కారం లేకపోవడంతో కొట్టు పొట్టుగా నిమ్ము ధాన్యాన్ని విక్రయించారు. మిల్లర్లు 75 కేజీల ధాన్యం బస్తాను రూ.1,600కు కొను గోలు చేశారు. నిబంధనల ప్రకారం తేమ లేని ధాన్యాన్ని రూ.1,850 వరకు ఇవ్వా లి. తేమ శాతం లెక్కిస్తే నిమ్ము ధాన్యానికి ఇచ్చే రూ.1,600తో మంచి ధర వస్తుం దని రైతులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాడేపల్లిగూడెం పరిధిలోనే 15 వేల ఎకరాల వరకు మాసూళ్లు జరిగింది. గణపవరంలో రెండు రోజులుగా మాసూళ్లు జరగటంతోపాటు ఎప్పటికప్పుడు ధాన్యం అమ్మకాలు జరుగుతున్నాయి.

Updated Date - Nov 19 , 2026 | 12:03 AM